Tuesday : ప్రతి రోజూ మనం అన్ని పనులు చేయడానికి అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో కొన్ని పనులను చేయడం అసలు మంచిది కాదని పండితులు అంటున్నారు. మంగళవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకూడదు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇవి తప్పే అని తెలుసుకోండి. మంగళవారం అనగానే అమంగళంగా చాలామంది భావిస్తారు. కానీ నిజానికి మంగళవారం కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
నవగ్రహాల్లో ఉన్న కుజుడు మంగళవారానికి అధిపతి. కుజుడు రౌద్రాన్ని కలిగి ఉంటాడు. కనుక మంగళవారం రోజు పది మంది కలిసి చేసే పనులని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. పది మంది కలిసి చేస్తే కుజుడికి కోపం వస్తుంది. దాంతో నలుగురి మధ్య గొడవలు, కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. మంగళవారం నాడు ఎంత పని ఉన్నా ఒక్కరే చేసుకోవడం మంచిది. మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు. మంగళవారం నాడు అప్పు తీర్చడం చాలా మంచిది.
మంగళవారం నాడు అప్పు తీరిస్తే మళ్లీ చేయవలసిన అవసరం రాదట. మంగళవారం శస్త్ర చికిత్స చేసుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం వంటి పనులు చేయకండి. మంగళవారం నాడు ఇల్లు, భూమిని కొనడం వంటివి చేయకూడదు. రిజిస్ట్రేషన్ పనులు కూడా చేయకూడదు.
మంగళవారం నాడు ఇటువంటి పనులు చేయడానికి తుది నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్‌లో చేరడం కూడా మంచిది. మంగళవారం నాడు వాహనాలు మాత్రం కొనుగోలు చేయకూడదు. మంగళవారం నాడు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కూడా మంచిది కాదు. మంగళవారం నాడు వ్యవసాయదారులు మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు వంటి వాటికి సంబంధించిన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…