Vastu Tips : మనలో చాలా మంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదిష్టి తగలకూడదని ఇంటి ప్రధాన ద్వారంపై లోపల మరియు బయట దేవుళ్ల ఫోటోలను ఉంచుతారు. మనకు ఎక్కువగా గణపతి ఫోటోలు, గజ లక్ష్మీ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారంపై దేవుళ్ల ఫోటోలను ఉంచవచ్చా.. లేదా… ఒకవేళ ఉంచితే ఎటువంటి ఫోటోలను ఉంచాలి.. దీని గురించి పండితులు ఏం చెబుతన్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి చాలా ముఖ్యమైన వాటిల్లో ఇంటి ప్రధాన ద్వారం ఒకటి. ఈ ద్వారం గుండానే మనం ఇంట్లోకి బయటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాము. మన ఇంటికి బంధువులు, బయట వ్యక్తులు ఎవరు వచ్చిన ఈ ద్వారం గుండానే వస్తూ ఉంటారు.
అయితే ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు ఎటువంటి దేవుళ్ల ఫోటోలను ఉంచకూడదని పండితలు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలా ఉంచాలి అనుకుంటే శంఖు చక్రాలను, నామాల ఫోటోలను ఉంచడం మంచిదని వారు చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి లోపలి వైపు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోను, అమ్మవారు లక్ష్మీ దేవి ఫోటోను, గణపతి ఫోటోను, కుల దేవతలకు సంబంధించిన ఫోటోలను ఉంచవచ్చు. ఇక నరదిష్టి, వాస్తు దోషం ఉండకూడదు అనుకునే వారు ఐశ్వర్య కాళీ ఫోటోను లేదా గోమాత సమేత ఐశ్వర్య కాళీ ఫోటోను ఉంచవచ్చు. మన ఇంటికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. వారు పైకి మనతో మంచిగా మాట్లాడినప్పటికి ఇంట్లోని వస్తువులను ఇంటి అందాన్ని చూసి లోలోపల చెడు దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు. ఈ చెడు దృష్టి, నరదిష్టి వంటివి మనపై పడకుండా ఉండాలంటే గోమాత సమేత ఐశ్వర్య కాళీ ఫోటోను ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గోడపై కేవలం గణపతి ఫోటోను మాత్రమే ఉంచాలని వారు చెబుతున్నారు. చాలా మంది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గోడపై లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్థామి ఫోటోను ఉంచుతారు. ఇలా చేయడం మంచిది కాదని ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి బయటకు పోతుందని వారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో తూర్పు, పడమర దిక్కుల్లోనే దేవుడి ఫోటోలను ఉంచి పూజించడం మంచిదని వారు చెబుతున్నారు. ఉత్తర ,దక్షిణ దిక్కులల్లో దేవుడి ఫోటోలను ఉంచి వాటిని పూజించినప్పటికి ఎటువంటి ఫలితం ఉండదని వారు సూచిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…