Shani Direction Change : జోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనిగ్రహాన్ని ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేసే వారికి మంచి ఫలితాలను, చెడు చేసే వారికి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని శిక్షించడానికి వస్తే మాత్రం రాజు కూడా బిక్షగాడు అవుతాడు. అందుచేత జోతిష్యశాస్త్రంలో శని గమనంలో మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రస్తుతం శని త్రికోణంలో కుంభరాశిలో ఉంది. అలాగే జూన్ 29 నుండి శని తిరోగమనం చెందబోతుంది. శని యొక్క ఈ తిరోగమన కదలికలు రాశిచక్ర గుర్తులపై భారీ ప్రభావాన్ని చూపించనున్నాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు వారికి ఆర్థికంగా బలాన్ని ఇవ్వడంతో పాటు కెరీర్ లో కూడా మంచినే సూచించబోతున్నాయి.
శని తిరోగమనం ఏయే రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శని తిరోగమనం మేష రాశి వారికి మంచి ప్రయోజనాలను చేకూర్చబోతుంది. వీరికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భారీ లాభాలు రానున్నాయి. మీకు చేరాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. గౌరవం పెరుగుతుంది. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని తిరోగమనం వల్ల వృషభ రాశి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. కెరీర్ పరంగా చాలా ఉన్నతమైన పురోగతిని చూస్తారు. మీరు చేసే అన్ని పనులు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్థులకు లాభం చేకూరుతుంది. తులా రాశి వారికి కూడా శని తిరోగమనం మంచిని కలిగిస్తుంది.
తులారాశి వారికి అధిపతి అయిన శుక్రుడు శనికి మిత్రుడు. కనుక ఈ రాశి వారికి శనిగ్రహం విశేష ఫలితాలను ఇస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మీకు మంచి తరుణం. అలాగే ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం ఖరారు కానుంది. ఇక శని తిరోగమనం ధనస్సు రాశి వారికి కూడా మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి జీవితాల్లో సంపద రాకకు బలమైన అవకాశాలను సృష్టిస్తోంది. ధనస్సు రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.