ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం గృహాలంకరణలో ఏనుగు బొమ్మలు కీలకపాత్రను పోషిస్తాయి. ఇంట్లో ఏనుగు బొమ్మలను పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అనేక సమస్యలు తగ్గుతాయి. ఏనుగులకు చెందిన బొమ్మలు లేదా ఫొటోలను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు బొమ్మలను రెండింటిని పెట్టాలి. ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మను ఉంచాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలు తగ్గుతాయి. ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆ బొమ్మలను చూసి వెళ్తే ఆ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
* వాస్తు ప్రకారం ఏనుగులను దుష్టశక్తుల బారి నుంచి రక్షించే రక్షకులుగా భావిస్తారు. అందువల్ల ఏనుగు బొమ్మలు లేదా ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటే దుష్ట శక్తుల ప్రభావం ఉండదు. నర దృష్టి పడకుండా ఉంటుంది.
* ఇంట్లో దంపతుల మధ్య కలహాలు ఉంటే వారు జంట ఏనుగు బొమ్మలను బెడ్‌రూమ్‌లో ఉంచాలి. లేదా దిండు కవర్లపై జంట ఏనుగుల చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో దంపతుల మధ్య వచ్చే కలహాలు తగ్గుతాయి. దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది.
* ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గొడవలు అవుతుంటే వారు తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు కలిపి ఉండే బొమ్మలను పెట్టుకుంటే మేలు జరుగుతుంది.
* పిల్లలు చదువుకునే టేబుల్స్ పై లేదా వారి గదుల్లో షెల్ఫ్‌లలో ఏనుగు బొమ్మలను ఉంచాలి. ఏనుగుల ఫొటోలు లేదా పెయింటింగ్‌లను కూడా ఉంచవచ్చు. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. ప్రతిభా పాటవాలు పెరుగుతాయి.
* ఆఫీస్ లో లేదా పనిచేసే చోట చిన్న ఏనుగు బొమ్మలను ఉంచితే వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు అయితే కెరీర్‌లో ప్రగతి సాధిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
* ఏనుగు ఏదైనా వస్తువును తొండంతో పట్టుకున్నట్లు ఉండే బొమ్మలను ఇంట్లో పెట్టుకుంటే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు ఉండకుండా సాఫీగా సాగిపోతుంది. కష్టాలు తగ్గుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…