Love Line : మనలో చాలా మంది వారిది ప్రేమ వివాహామా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అని ముందుగానే తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉంటారు. అయితే వాస్తవానికి మన చేతి రేఖలను బట్టి మన వైవాహిక జీవితం గురించి తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. హస్తసాముద్రికం ద్వారా మన చేతి రేఖలను బట్టి వైవాహిక జీవితం గురించి తెలుసుకోవచ్చు. దీని కోసం మన చేతి రేఖలను ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉండే రేఖలను బట్టే మనం దీనిని కనిపెట్టవచ్చు. చేతి రేఖలను బట్టి వైవాహిక జీవితం గురించి ఎలా తెలుసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. హస్తసాముద్రికం ప్రకారం వైవాహిక రేఖలు చేతుల యొక్క చిన్న వేలుక్రింద ఉన్న మెర్క్యురీ పర్వతానికి సంబంధించినవి.
ఈ మౌంట్ మెర్క్యూరీ బయట నుండి లోపలికి వచ్చే రేఖను వివాహ రేఖ అంటారు. ఈ లైన్ ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితం గురించి చాలా చెబుతుంది. మనం ప్రేమ వివాహం చేసుకుంటామా.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటామా… అని రేఖను బట్టి తెలుసుకోవచ్చు. మన అరచేతిలో వైవాహిక రేఖ చదరపు ఆకారంలో ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రేఖ కనుక మధ్యలో కట్ అయినట్టు ఉంటే వారి వివాహ సంబంధం మళ్లీ మళ్లీ విచ్చినమవుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే అరచేతిలో చిటికెన వేలు కింద సరళమైన, స్పష్టమైన రేఖ ఉంటే వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. అలాగే వీరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందని అర్థం. అదే విధంగా బొటన వేలు కింద ఉన్న భాగాన్ని వీనస్ పర్వతం అంటారు.
వీనస్ పర్వతం పైకి లేచినట్టు కనిపిస్తే వారిది ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా హస్తసాముద్రికం ప్రకారం చేతిలో వివాహ రేఖ స్పష్టంగా మరియు లోతుగా ఉంటే వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి వారి జీవిత భాగస్వాములు వారి భావోద్వేగాలను చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారు తమ జీవిత భాగస్వామి నుండి చక్కటి మద్దతును పొందుతారు. అలగే వీనస్ పర్వతం కనుక స్పష్టంగా కనిపిస్తే వారి జీవితంలో జీవిత భాగస్వామితో శృంగారం చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా మన చేతిలో రేఖలను బట్టి మన వైవాహిక జీవితం గురించి చాలా సులభంగా తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…