చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని, దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని మారాలి.
అదే మీరు సొంత ఇంటిని కట్టుకుంటున్నట్లయితే, ఇంటి యజమానితో పాటగా భార్యాబిడ్డల పేరు కూడా చూసుకుని, ఏ దిక్కులో ఇల్లు ఉంటే మంచిది అని చూసుకుని ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవాలి. ఇల్లును ఎప్పుడైనా మారేటప్పుడు కచ్చితంగా వాస్తు పరంగా ఆ ఇల్లు బాగుందా లేదా అనేది తప్పక చూసుకోవాలి. అలానే ముఖ్యంగా ఇంటి ముఖద్వారం గురించి చూసుకోవాలి. ఏదైనా ఇంటికి వెళ్ళేటప్పుడు శకునాన్ని బట్టి కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు.
కొన్ని కొన్ని సార్లు ఇల్లంతా బాగుంటుంది. కానీ రెండు మూడు ఇళ్ల నుండి కూడా ఎవరు ఆ ఇంట్లో ఉండరు. అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటువంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉండే అవకాశం ఉంది. గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి చనిపోయినప్పుడు బొటనవేలంత అయిపోతాడు. అయితే మనిషి చనిపోయిన తర్వాత పది రోజులు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మనిషికి శరీరం వస్తుంది. ఒకవేళ కనుక ఇది జరగకపోతే శరీరం రాదు. ప్రేతాత్మ అయ్యి తిరుగుతాడు.
ఆ వ్యక్తి ఈ భూమి అంతరించిపోయే వరకు కూడా ప్రేతాత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రేతాత్మలు ఖాళీగా ఉండే ఇళ్లల్లో ఉంటాయి. ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే, మీరు ఇంట్లో దిగడానికి ముందు, ఆ ఇంట్లో గోమూత్రాన్ని చల్లాలి. అదే విధంగా 11 రోజులు పాటు ఉప్పుని నీళ్లలో వేసి, ఆ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే ప్రేతాత్మలు పోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లలితా సహస్రం చదవడం ఆడియో ని ప్లే చేయడం వంటివి చేస్తే కూడా ఆ తరంగాలు ఇంట్లో వచ్చి మంచి వైబ్రేషన్స్ తీసుకువస్తాయి. ఇలా చిక్కులు లేకుండా ఆ తర్వాత ఇంట్లో సుఖంగా ఉండొచ్చు. సమస్యలేమి లేకుండా హాయిగా జీవించొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…