Apartment : ప్రతి ఒక్కరూ కూడా, సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో కలలు కంటూ ఉంటారు. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. వాస్తు ప్రకారం, మనం ఇంటిని నిర్మించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది, అపార్ట్మెంట్లని కొంటున్నారు. అపార్ట్మెంట్లకు కొనేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలని గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా అపార్ట్మెంట్ ని కొనాలి అని అనుకుంటున్నారా..? అయితే, తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని పాటించండి. ఇలా చేయడం వలన, అంతా మంచి జరుగుతుంది. ఏ సమస్య ఉండదు. అపార్ట్మెంట్ కొనేటప్పుడు, మొట్టమొదట మీరు ప్రవేశ ద్వారం చూడాలి.
ప్రవేశ ద్వారం మొత్తం కుటుంబానికి సానుకూలత, ఆనందాన్ని అందించడానికి కీలకమైనది. ఉత్తరం వైపు ప్రవేశద్వారం ఉంటే, ఆర్థిక వ్యాపార విషయాల్లో విజయాన్ని అందుకుంటారు. కెరియర్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ప్రవేశ జ్వరం దక్షిణం, పశ్చిమ దిశల్లో ఉండకూడదు. ఉత్తరం వైపు లేదంటే ఈశాన్యం వైపు ఉండొచ్చు. ఇలా ఉండడం వలన, సూర్యకిరణాలు ఇంట్లో ప్రవేశిస్తాయి. అలానే, ఇంటి తలుపులు కూడా వాస్తు ప్రకారం ఉండాలి. అలా ఉంటేనే, అనుకున్న పనులు పూర్తవుతాయి. విజయాన్ని అందుకుంటారు.

తూర్పు వైపు లివింగ్ రూమ్, సామాజిక సంబంధాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంటి ఉత్తర, ఈశాన్యం మండలాల మధ్య టాయిలెట్ ని నిర్మించుకోవద్దు. ఈ తప్పు చేస్తే, కుటుంబ సభ్యులు మధ్య ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. కిచెన్ కి ఆగ్నేయం అనుకూలం. ఈశాన్యం, నైరుతి మూలలో వంటగది ఉండకూడదు. పడక గది నైరుతి వైపు ఉంటే, దాంపత్య జీవితం బలహీనమవుతుంది.
మంచి నిద్ర ఉండదు. విశ్రాంతి దొరకదు. పడకగది ఎప్పుడు కూడా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో మాత్రమే ఉండాలి. పిల్లలు బెడ్ రూమ్, ఈశాన్యం వాయువ్య మూలల్లో ఉండాలి. కిటికీలు ఉత్తరం వైపు ఉండాలి. టాయిలెట్లు ఎప్పుడూ కూడా పూజగది గోడకి ఆనుకుని ఉండకూడదు. ఇలా, మీరు ఇల్లుని కొనేటప్పుడు కచ్చితంగా వీటిని చూసి ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.