Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మనం మన జీవితంలో అన్ని నియమాలను పాటించినట్లయితే ఎలాంటి దోషాలు కూడా ఉండవు. మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల కూడా మన ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. అవి దోషాలను కలిగిస్తాయని చాలా మందికి తెలియవు. దీంతో తెలియక తప్పులు చేస్తుంటారు. తరువాత దోషాలు ఏర్పడి ఇంట్లోని అందరికీ సమస్యలు వస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో అన్నీ సమస్యలే ఉంటే మీ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి. వాస్తు దోషం ఉంటే పలు సంకేతాలు కనిపిస్తాయి.
ఇంట్లో గనక వాస్తు దోషం ఉంటే ఇంట్లోని వారికి ఎల్లప్పుడూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అవి ఒక పట్టాన తగ్గవు. దీంతోపాటు సంపాదించే డబ్బు అంతా వృథాగా ఖర్చవుతుంది. లేదా ఆదాయం వచ్చే మార్గాలు తగ్గిపోతాయి. ఇక ఇంట్లోని వారందరూ సంతోషంగా ఉండరు. ఎల్లప్పుడూ కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా గనక ఎవరి ఇంట్లో అయినా ఉంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడ్డాయని గ్రహించాలి. అందుకు గాను కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో దోషాలను తొలగించుకుని సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొక్కలను ఇంట్లో పెట్టాలి..
మీ ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ఇవి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. దీంతో మీకు ఉండే దోషాలు పోయి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో మనీ ప్లాంట్, జేడ్ ప్లాంట్, బాంబూ ప్లాంట్, రబ్బర్ ట్రీలను పెంచాలి. దీంతో ఇవి మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తాయి. మీ ఇంట్లో సంతోషం నెలకొనేలా చేస్తాయి. అలాగే ఇంట్లో మీరు ఎల్లప్పుడూ అగర్‌బత్తీలను వెలిగించాలి. వీటి నుంచి వచ్చే పొగ వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దీంతో దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. దిష్టి పోతుంది. మీకుండే సమస్యలు తగ్గుతాయి. నరఘోష నుంచి బయట పడవచ్చు.
చాలా మంది ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ గుమ్మం వద్ద మాత్రం చెప్పులు, చెత్త ఉంచుతారు. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం చెందడమే కాకుండా వాస్తు ప్రకారం దోషం ఏర్పడుతుంది. కనుక మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చూడగానే ఆకట్టుకునేలా అలంకరించాలి. గుమ్మం ఎదురుగా చెప్పులు ఉండకూడదు. ఇలా గనక గుమ్మాన్ని అలంకరిస్తే వాస్తు దోషం పోతుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. దీంతో మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
స్వస్తిక్ సింబల్ ముఖ్యం..
ఇక మీ ఇంట్లో ఉండే నల్లాలు లేదా వాటర్ ట్యాంక్ నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోండి. నీరు లీక్ అయితే వాస్తు దోషం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంట్లో రాగితో చేసిన స్వస్తిక్ సింబల్‌ను పెట్టుకోండి. ఇది మీ ఇంట్లోకి ధనాన్ని, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. వాస్తు దోషాలను పోగొడుతుంది. ఇలా ఈ చిన్న పరిహారాలను పాటిస్తే చాలు, వాస్తు దోషాలను తొలగించుకుని అందరూ సంతోషంగా ఉండవచ్చు.