కరోనా నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా అన్ని బ్యాంకులు వీలైనంత వరకు అన్ని లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ తన వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఇంటి వద్దకే నగదు తెచ్చి అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని ఎస్‌బీఐ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ఎస్‌బీఐ అందిస్తున్న డోర్ డెస్ట్ డెలివరీ సర్వీస్ తో రోజుకు రూ.20వేల వరకు ఖాతాదారులు ఇంటి వద్దే నగదు పొందవచ్చు. అంతే మొత్తంలో నగదును డిపాజిట్ చేయవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఈ సేవ అందుబాటులో ఉంటుంది. బ్యాంకు పనిదినాల్లో మాత్రమే ఈ సేవను అందిస్తారు.
ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచ్ నుంచి మాత్రమే ఇలా నగదు పొందే సౌకర్యం ఉంది. నగదు డెలివరీ సమయంలో కేవైసీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌కు రూ.100 + జీఎస్టీ ఫీజు చెల్లించాలి. నగదు డిపాజిట్ చేసినా ఇంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 1800 1111 03 అనే నంబర్‌కు కాల్ చేయవచ్చు. హోం బ్రాంచి నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండే కస్టమర్లు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ తో నగదును విత్‌డ్రా చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…