స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అందులో భాగంగా 4 యాప్‌లను ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకూడదని సూచించింది. గత 4 నెలల కాలంలో 150 మందికి పైగా ఎస్‌బీఐ కస్టమర్లు రూ.70 లక్షలకు పైగా సైబర్ మోసాల బారిన పడి నష్టపోయారు. అందువల్ల సదరు యాప్ లను ఇన్‌స్టాల్ చేయకూడదని ఎస్‌బీఐ చెబుతోంది.
ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ.. ఈ నాలుగు యాప్ లను ఎస్‌బీఐ కస్టమర్లు ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయరాదు. వీటి సహాయంతో మోసగాళ్లు ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకుని యూపీఐ ద్వారా డబ్బులను కాజేస్తున్నారని ఎస్‌బీఐ తెలియజేసింది. అందువల్ల ఆ యాప్‌లను ఫోన్ లో ఇన్‌స్టాల్ చేయకూడదని ఎస్‌బీఐ సూచించింది.
ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఎస్‌బీఐ పై విధంగా తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక చాలా మంది కస్టమర్లు ఏదైనా సహాయం అవసరం అయి టోల్ ఫ్రీ నంబర్ కావల్సి వస్తే గూగుల్‌లో వెదుకుతున్నారని, అలా చేయకూడదని, ఎస్‌బీఐకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబర్‌లకే కాల్ చేయాలని కూడా సూచించింది. ఇక ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఎస్‌బీఐ కస్టమర్లు 1800111109, 9449112211, 08026599990 అనే నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా 155260 నంబర్‌కు డయల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌బీఐ తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…