PM Kisan Yojana : ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ యోజన (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన) పథకాన్ని గతంలోనే ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకం రైతులకు ఒక వరం లాంటిది. ఇప్పటికే ఎన్నో కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మోదీ అధికారంలోకి వచ్చారు కనుక మళ్లీ ఈ పథకం కింద రైతులకు 17వ దఫా కింద నగదును బదిలీ చేశారు. గతంలో ఫిబ్రవరి 28వ తేదీన 16వ దఫా నగదును ఇచ్చారు. ఇప్పుడు 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. దీనిపై మోదీ ప్రధాని అయ్యాక తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ఆరంభం అయింది. అందువల్ల రైతుల పెట్టుబడికి ఈ నగదు ఉపయోగం కానుంది.
అయితే ఈ పథకంలో మీరు లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ నగదు బదిలీ అవడం లేదు అంటే మీరు ఈ-కేవైసీ చేయించుకోలేదని అర్థం. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ ను ప్రతి ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా సమయానికే రిలీజ్ చేశారు. అయితే ఈ నగదు ఈ నెల చివరి వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఇక ఈ విడత కింద రూ.2వేలను ఇస్తున్నారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే నగదు బదిలీ అవదు. కనుక ఈ-కేవైసీ సరిగ్గా ఉందో లేదో రైతులు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ ఈ-కేవైసీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ 12 అంకెలున్న మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. తరువాత సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ కేవైసీ పూర్తవుతుంది. అయితే మీరు ఇచ్చిన సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. లేదంటే మీ బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ అవదు. కనుక ఇలాంటి సమస్యలు ఉన్నవారు pmkisan-ict@gov.in కి ఈ-మెయిల్ పంపించవచ్చు. లేదా పీఎం కిసాన్ యోజన ఫోన్ నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయవచ్చు.
కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తుండగా వాటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇస్తుంది. పెట్టుబడి సహాయం అందిస్తుంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తున్నారు. అయితే దీనిని ఒకేసారి కాకుండా 3 సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో అందిస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ. 2000 చొప్పున రైతులకు వస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…