ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదా ? లింక్ అయినా వేరే వాళ్ల నంబర్ ఉందా ? ఇప్పటికే లింక్ అయి ఉన్న నంబర్ పనిచేయక వేరే నంబర్‌ను అప్ డేట్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇకపై మీ ఇంటి వద్దే మీ ఆధార్ కార్డు ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. అందుకు గాను కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నంబర్‌ను మీ ఇంటి వద్దే అప్ డేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సేవ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉండేది. కానీ ఇక దీన్ని ఇంటి వద్దే పొందవచ్చు. ఇందుకుగాను పోస్ట్‌మ్యాన్‌లు సహాయం చేస్తారు. వారు మీ ఆధార్ ఫోన్ నంబర్‌ను మారుస్తారు.
దేశంలోని 1.46 లక్షల మంది పోస్ట్‌మ్యాన్‌లు ఈ సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 650 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ల ద్వారా ఈ సేవను అందిస్తారు. అలాగే గ్రామీణ్ డాక్ సేవక్‌లు కూడా ఈ సేవను అందిస్తారు. అందువల్ల మీరు మీ ఆధార్ ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలంటే ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటికి వచ్చే పోస్ట్‌మన్‌తోనే ఆ నంబర్‌ను సులభంగా మార్పించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…