స‌మాచారం

ఇక వాహనాలకు నామినీలను పెట్టుకోవచ్చు.. వాహనదారుడు మరణిస్తే నామినీల పేరిట వాహనం ట్రాన్స్‌ఫర్‌..

దేశంలో ఉన్న వాహనదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మోటారు వాహన చట్టం కింద కొత్త కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టడమే కాక సేవలను అందించడాన్ని మరింత సులభతరం చేసింది. ఈ క్రమంలోనే వాహనదారులకు కేంద్రం మరో అద్భుతమైన సదుపాయాన్ని అందిస్తోంది. వాహనదారులు చనిపోతే వారి వాహనాలను తమ కుటుంబ సభ్యుల పేరిట ట్రాన్స్‌ఫర్‌ చేసునేందుకు ఇప్పటి వరకు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఆ పద్ధతి అంతా గందరగోళంగా ఉండేది. కానీ దీన్ని కేంద్రం సులభతరం చేసింది.

ఇకపై వాహనదారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సమయంలోనే సంబంధిత పత్రాల్లో నామినీగా ఎవర్నయినా పెట్టుకోవచ్చు. అంటే బ్యాంకు కార్యకలాపాల్లో ఎలాగైతే నామినీని పెట్టుకునే సదుపాయం కల్పిస్తున్నారో అలాగే వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సమయంలోనూ వాటికి నామినీలను పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో వాహనదారులు చనిపోతే నామినీలు వాహనదారుడి డెత్‌ సర్టిఫికెట్‌ను, తమ ఐడీ ప్రూఫ్‌ను ఆర్‌టీఏ కార్యాలయంలో సమర్పించాలి. దీంతో 30 రోజుల్లోగా నామినీ పేరిట వాహనం ట్రాన్స్‌ఫర్‌ అయి కొత్త ఆర్‌సీ వస్తుంది. ఇలా సులభంగా ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. గతంలో ఈ విధానం చాలా క్లిష్టంగా ఉండేది. కానీ కేంద్రం మోటారు వాహన చట్టం నియామలు 1989 ప్రకారం కొత్తగా నామినీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఇప్పటికే వాహనాలను రిజిస్టర్‌ చేయించుకున్న వారు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అందుకు గాను సంబంధిత రాష్ట్రానికి చెందిన ఆర్‌టీవో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ఫామ్‌ను నింపాలి. అందులో వాహనదారుడు తమ నామినీ పేరును నమోదు చేయడంతోపాటు నామినీకి చెందిన ఐడీ ప్రూఫ్‌ను ఇవ్వాలి. దీంతో వాహనదారుడి వాహనానికి నామినీలు నమోదు అవుతారు. తరువాత వాహనదారుడు ఎప్పుడైనా మరణిస్తే నామినీలు సులభంగా ఆ వాహనాన్ని తమ పేరిట పై విధంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. కాగా ఈ కొత్త సదుపాయం తక్షణమే అందుబాటులోకి వచ్చిందని కేంద్రం తెలిపింది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM