ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం ఏమోగానీ అప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. బయట మనం చిన్న వస్తువు కొన్నా వ్యాపారుల వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు మాధ్యమాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో సహజంగానే ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అలవాటు పడ్డారు. అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతుండడం బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో రోజూ అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను మాయ చేసి కొందరు డబ్బులను దోచేస్తున్నారు. అయితే సైబర్ మోసం బారిన పడి డబ్బును నష్టపోతే దిగులు చెందాల్సిన పనిలేదు. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయి. ఆర్‌బీఐ ఇందుకు ప్రత్యేక నియమావళిని సూచించింది.
సైబర్ మోసం జరిగినప్పుడు ప్రజలు తమ అకౌంట్లు ఉన్న బ్యాంకులకు సంఘటన జరిగిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. దీంతో 10 రోజుల్లోగా పోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇక సంఘటన జరిగిన తరువాత 4-7 రోజుల మధ్యలో ఫిర్యాదు చేస్తే ప్రజలు రూ.25వేల వరకు నష్టపోవాల్సి ఉంటుంది. మోసపోయిన మొత్తాన్ని బట్టి నష్టపోయే మొత్తం మారుతుంది. అయితే ప్రజలు తమ ప్రమేయం లేకుండా డబ్బు పోతే దాన్ని నిర్ణీత సమయంలోగా ఫిర్యాదు చేసి వెనక్కి పొందవచ్చు. కానీ వారి నిర్లక్ష్యం కారణంగా డబ్బు పోతే బ్యాంకులు అందుకు బాధ్యత వహించవు.
ఇతరులకు మీ బ్యాంక్ లేదా కార్డుల సమాచారం చెప్పినా, పిన్ లేదా పాస్‌వర్డ్‌లను షేర్ చేసినా, ఇతరులతో కార్డు ఉపయోగించినా, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి డబ్బును నష్టపోయినా.. అందుకు ఖాతాదారులదే బాధ్యత ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు ఏమీ చేయలేవు. ఖాతాదారుల ప్రమేయం అసలు లేకున్నా డబ్బు పోతేనే బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అలాంటి సందర్భాల్లోనే డబ్బును బ్యాంకులు రీఫండ్ చేస్తాయి. మిగిలిన సందర్బాల్లో డబ్బులు పోతే పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది. వారు మోసగాళ్లను ట్రేస్ చేసి గుర్తించి డబ్బును రికవరీ చేస్తారు. అదీ మోసగాళ్ల దొరికితేనే, వారి దగ్గర డబ్బు ఉంటేనే రికవరీకి సాధ్యమవుతుంది. లేదా పోయిన డబ్బులు వెనక్కి రావు. కనుక అత్యంత విలువైన మీ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులకు అస్సలు చెప్పకండి. బ్యాంకింగ్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…