Loan To Women : ఈరోజుల్లో చాలామంది వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. మహిళలు కూడా వ్యాపారాలని మొదలు పెడుతున్నారు. మీరు కూడా మంచి వ్యాపారంతో మీ సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకువచ్చింది. మొదట కర్ణాటక ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. తర్వాత కేంద్రం దీనిని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా కూడా తీసుకువచ్చింది. ఉద్యోగిని స్కీమ్ ద్వారా చాలామంది మహిళలు ప్రయోజనాన్ని పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకే ఎక్కువ ప్రాధాన్యత. ఈ పథకంతో వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలు వ్యవస్థాపకులుగా మారవచ్చు. ఈ స్కీములో పేదలు నిరక్షరాస్య నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలకి సపోర్ట్ వస్తుంది. ఈ స్కీము కింద ఇప్పటి వరకు 48 వేల మందికి పైగా మహిళలు లబ్ధి పొందారు. వ్యాపారాలు చేస్తున్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు వాళ్ళు ఈ స్కీముకి అర్హులు. కుటుంబ సంవత్సర ఆదాయం తప్పనిసరిగా రూ.1.50 లక్షలకు మించి వుండకూడదు.
అంగ వైకల్యం ఉన్నవారు, దళిత మహిళలు, వితంతువులకు అయితే ఈ స్కీము కింద వడ్డీ లేకుండానే లోన్ వస్తుంది. మిగిలిన మహిళలకు అయితే 10 నుంచి 12 శాతం వడ్డీ మీద లోన్ వస్తుంది. ఈ వడ్డీ బ్యాంకులను బట్టి మారుతుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం దాకా సబ్సిడీ కూడా ఇస్తారు. లోన్ అమౌంట్ రూ. 3 లక్షలకు మించదు. ఎలాంటి సెక్యూరిటీ అక్కర్లేదు. వైకల్యం ఉన్నవారు, వితంతువులకి వయో పరిమితి, కుటుంబ ఆదాయం పరిమితి ఉండదు.
మిగతా వాళ్ళు తప్పక సిబిల్ స్కోరు బాగా వుండేటట్టు చూడండి. దరఖాస్తు ఫారం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతోపాటుగా ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ని కూడా ఈ స్కీముని పొందేందుకు కావాలి. ఈ స్కీము ప్రయోజనాలని పొందాలనుకునే వారు సమీపంలోని బ్యాంకుని సంప్రదించాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…