ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ, కోరోవర్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓ కాంపిటీషన్‌లో పాల్గొంటే రూ.1 లక్ష గెలుచుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వీడియోలను తీసి అప్‌లోడ్ చేయడమే.
ప్రయాణాలు అంటే బాగా ఇష్టం ఉన్నవారు భారతీయ రైల్వేతోపాటు ఐఆర్‌సీటీసీకి చెందిన టిక్కెటింగ్, కాటరింగ్, టూరిజం వంటి పలు రకాల అంశాలపై వీడియోలను తీయాలి. వాటిని https://corover.ai/vlog/ అనే సైట్‌లో అప్‌లోడ్ చేసి వివరాలను నమోదు చేసి కాంపిటీషన్ లో పాల్గొనాలి. దీంతో ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందజేస్తారు.
రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25వేల బహుమతిని అందజేస్తారు. అలాగే ట్రోఫీ, సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేస్తారు. ఇక మరో 297 మందికి రూ.500 నగదు బహుమతి, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 31లోగా తమ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోవాలి. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ఈ పోటీలో మొత్తం 300 విన్నర్లకు నగదు బహుమతులను అందజేస్తారు. వీడియోల క్వాలిటీని బట్టి విన్నర్లను ఎంపిక చేస్తారు. యూజర్లు పంపిన అన్ని వీడియోలు ఐఆర్‌సీటీసీకి చెందుతాయి. కాపీరైట్ వారికే ఉంటుంది. కానీ వీడియో తీసిన వారి పేరును దానిపై వేస్తారు. యూజర్లు ఐఆర్‌సీటీసీకి చెందిన IRCTC Tourism, IRCTC Air, IRCTC iMudra App, Website, IRCTC E-Catering, IRCTC SBI Card, IRCTC New E-Ticketing Website, IRCTC Bus Booking, IRCTC Tejas Train, IRCTC Retiring Room Booking వంటి అంశాలపై వీడియోలను తీయవచ్చు. ఈ వివరాలను ఐఆర్‌సీటీసీ తాజాగా ఓ ట్వీట్‌లో తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…