డబ్బును పెట్టుబడిగా పెట్టి సురక్షితమైన పద్ధతిలో లాభాలు పొందాలని చూస్తున్నారా ? అయితే పోస్టాఫీస్ మీకు అనేక రకాల సేవింగ్స్ స్కీమ్‌లను అందిస్తోంది. వాటిల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ ద్వారా నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే మెచూరిటీ గడువు ముగిసే వరకు పెద్ద మొత్తంలో లాభాలను పొందవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు కనీసం రూ.100 పొదుపు చేయవచ్చు. అదే రూ.10వేలను నెల నెలా పొదుపు చేస్తే మెచూరిటీ గడువును 10 ఏళ్లుగా పెట్టుకుంటే అప్పుడు 10 ఏళ్ల తరువాత 5.8 శాతం వడ్డీతో రూ.16 లక్షలు వస్తాయి. ఈ విధంగా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను పొందవచ్చు. పైగా పోస్టాఫీస్‌లో డబ్బును పొదుపు చేస్తే పూర్తిగా ఆర్థిక భద్రత కూడా ఉంటుంది.
పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో కనీసం 5 ఏళ్ల వరకు పొదుపు చేయాలి. గరిష్టంగా 10 ఏళ్ల వరకు డబ్బును పొదుపు చేయవచ్చు. తరువాత డబ్బు తీసుకుని మళ్లీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్కీమ్‌తో ఎప్పటికీ లాభాలను పొందవచ్చు. ఇందులో భాగంగా వడ్డీని ఏడాదికి ఒకసారి చెల్లిస్తారు. ప్రస్తుతం ఏడాదికి 5.8 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ రేట్లు ప్రతి ఏడాది మారుతాయి. కొత్త రేట్లను ప్రతి ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ప్రకటిస్తారు.
పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ ద్వారా మీ డబ్బును ఎంతో సురక్షితమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు పొదుపు చేస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి.