దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో పౌరులకు అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎందులో ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి పోస్టాఫీసులు అందిస్తున్న అనేక స్కీమ్‌లలో డబ్బులను పొదుపు చేస్తే కొన్ని ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు. మరి ఆ స్కీమ్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఇందులో 1-3 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయవచ్చు. ఏడాదికి 5.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో డబ్బును పొదుపు చేస్తే 13 ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఇందులో 5 ఏళ్ల పాటు కూడా పొదుపు చేయవచ్చు. దీంతో 6.7 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల డిపాజిట్ స్కీమ్ తీసుకుంటే 10 ఏళ్ల 9 నెలలకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు.
పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును పొదుపు చేస్తే 18 ఏళ్లకు రెట్టింపు మొత్తం లభిస్తుంది. ఏడాదికి 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
రికరింగ్ డిపాజిట్స్ (ఆర్‌డీ) స్కీమ్‌లో పెట్టే డబ్బులకు ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో 12 ఏళ్ల 5 నెలల పాటు డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు మొత్తంలో లాభం పొందవచ్చు.
ఇందులో 6.6 శాడం వడ్డీని ఏడాదికి చెల్లిస్తారు. 10.91 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
వృద్ధులకు పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్స్ స్కీమ్ ఇది. ఇందులో వారికి ఏడాదికి 7.4 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9.73 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఏడాదికి 7.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. 10.14 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది.
ఆడపిల్లల కోసం అందజేస్తున్న పథకం ఇది. ఇందులో ఏడాదికి 7.6 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9 ఏళ్ల 6 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
దీంట్లో ఏడాదికి 6.8 శాతం వడ్డీని పొందవచ్చు. 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. 10 ఏళ్ల 7 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…