మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం కాలేదని.. పాన్ కార్డ్ – ఆధార్ అనుసంధానానికి గడువు ముగుస్తుందని టెన్షన్ పడుతున్నారా.. అయితే ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు – ఆధార్ అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీని ఆఖరి తేదీ ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు – ఆధార్ లింక్ తప్పని సరని తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు – ఆధార్ ను అనుసంధానం చేయడానికి ఎన్నోసార్లు గడువును పొడిగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ గడువును మరో ఆరు నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలందరికీ ఎంతో ఊరట కలిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…