ఒకప్పుడు కంప్యూటర్లలో హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు చాలా తక్కువ కెపాసిటీతో ఉండేవి. అంతేకాదు, చాలా నెమ్మదిగా పనిచేసేవి. కానీ టెక్నాలజీ మారింది. దీంతో వేగంగా పనిచేసే హార్డ్ డిస్క్ డ్రైవ్ (HDD)లు వచ్చాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న కంప్యూటర్లలో SSD లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇంతకీ అసలు SSD అంటే ఏమిటి ? దీనికి HDDలకు ఉన్న సంబంధం ఏమిటి ? రెండింటిలో ఏవి వేగంగా పనిచేస్తాయి ? వేటిని ఏయే అవసరాలకు వాడుతారు ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
HDD అంటే Hard disk drive అని అర్థం వస్తుంది. SSD అంటే Solid-state drive అని అర్థం. HDD లలో డేటాను ఫిజికల్‌గా స్టోర్ చేస్తారు. వాటిలో చిన్నపాటి డ్రైవ్‌లు ఉంటాయి. వాటిలో డేటా స్టోర్ అవుతుంది. ఇక SSD లలో చిప్స్ ఉంటాయి. వాటిలో డేటా స్టోర్ అవుతుంది. వేగం విషయానికి వస్తే డేటా చిప్స్ లో స్టోర్ అవుతుంది కనుక SSD లు వేగంగా పనిచేస్తాయి. వీటి కన్నా HDD లు కొద్దిగా నెమ్మదిగా పనిచేస్తాయి.
అయితే HDD లను ఎంత కాలం పాటు అయినా ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో ఎర్రర్స్ తక్కువగా వస్తాయి. ఒక వేళ డేటా పోయినా రికవరీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ SSD లు అలా కాదు. అవి కొంత కాలం పనిచేశాక పాడైతే వాటిల్లో ఉండే డేటాను రికవరీ చేయలేం. అందుకనే సాధారణంగా కంప్యూటర్లలో HDD లను డేటాను స్టోర్ చేసేందుకు వాడుతుంటారు. ఇక SSD లను ఆపరేటింగ్ సిస్టమ్‌లను హోస్ట్ చేసేందుకు వాడుతారు. వాటిల్లో సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. దీంతో కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి.
అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కంప్యూటర్లలో SSD, HDD లను రెండింటినీ కలిపి ఇస్తున్నారు. SSD లేకుండా కేవలం HDD లతోనూ కంప్యూటర్లు మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్లతో వేగంగా పనిచేయాలంటే కంప్యూటర్లలో కచ్చితంగా SSD ఉండాలి. SSD వాడకం వల్ల కంప్యూటర్‌లో వేగంగా పనిచేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు SSD లు 128జీబీ మొదలు కొని లభిస్తున్నాయి. చాలా వరకు కంప్యూటర్లలో SSD లను డిఫాల్ట్‌గా 128 జీబీ స్టోరేజ్‌తో ఇస్తున్నారు. అవసరం అయితే 256జీబీ, 512జీబీ, 1టీబీ వరకు కెపాసిటీ ఉన్న SSD లతో కంప్యూటర్లను తీసుకోవచ్చు. దీంతో ఎక్కువ సాఫ్ట్ వేర్లను ఇన్‌స్టాల్ చేసి వాడుకునేందుకు వీలు కలుగుతుంది.
ఇక HDD లు అయితే 1టీబీ, 2టీబీ, 4టీబీ ఉన్నవి మనకు లభిస్తున్నాయి. వీటిలో డేటాను ఎక్కువ స్టోర్ చేస్తారు కనుక డేటాను ఎక్కువ స్టోర్ చేయాల్సి వస్తుందనుకుంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న HDD లను తీసుకుని కంప్యూటర్లలో వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్యూటర్లలో SSD, HDD లు పనిచేస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…