మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రెండో దశ టోర్నీ ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ముగియాల్సిన టోర్నీ కోవిడ్ వల్ల వాయిదా పడింది. దీంతో యూఏఈలో ఈ టోర్నమెంట్ రెండో దశను నిర్వహిస్తున్నారు.
ఇక ఐపీఎల్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తోపాటు యాప్‌లో హాట్ స్టార్‌లో చూడవచ్చు. కానీ అందుకు గాను సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. అయితే ఎయిర్‌టెల్, జియో, జియో ఫైబర్ కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. అందుకు గాను కింద తెలిపిన ప్లాన్లను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.401, రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ వరుసగా 28, 28, 28, 56, 365 రోజులుగా ఉంది. వీటిని రీచార్జి చేసుకుంటూ ఉంటే హాట్ స్టార్‌కు గాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ను తీసుకోవాల్సిన పనిలేదు. ఉచితంగా ఆ సబ్‌స్క్రిప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. దీంతో ఐపీఎల్ చూడవచ్చు.
ఇక జియోలో అయితే రూ.401, రూ.598, రూ.2,599లతోపాటు రూ.499, రూ.612, రూ.1,004, రూ.1206, రూ.1208 యాడాన్ ప్లాన్లను కూడా రీచార్జి చేసుకుని హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.
జియో ఫైబర్ కస్టమర్లు రూ.999, రూ.1499, రూ.2499, రూ.3999, రూ.8499 ప్లాన్లను వాడితే ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా ఖాతాదారులు రూ.401, రూ.601, రూ.501, రూ.801 ప్లాన్లను రీచార్జి చేసుకోవడం వల్ల ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
ఈ విధంగా ఆయా నెట్‌వర్క్‌లకు చెందిన కస్టమర్లు ఆయా ప్లాన్లతో రీచార్జి చేసుకుంటూ, ఆయా ప్లాన్లను వాడితే ఉచితంగానే హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించవచ్చు.