టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇటీవలే రూ.447కు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఆ ప్లాన్‌లో 50 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. దానికి ఎలాంటి రోజువారీ డేటా లిమిట్ లేదు. 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్‌లు ఆ తరహా ప్లాన్‌ను లాంచ్ చేయడంతో వొడాఫోన్ ఐడియా కూడా ఆ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇక అదే తరహాలో రోజువారీ డేటా లిమిట్ లేకుండా రూ.267కే ఇంకో ప్రీపెయిడ్ ప్లాన్‌ను వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు.
వొడాఫోన్ ఐడియాకు చెందిన రూ.267 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు. 25 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి రోజువారీ లిమిట్ లేదు. ఎప్పుడైనా, ఎంతైనా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు. దీంతోపాటు వీఐ మూవీస్ అండ్ టీవీ క్లాసిక్ కు యాక్సెస్ లభిస్తుంది.
ఈ ప్లాన్‌ను వొడాఫోన్ ఐడియాకు చెందిన వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేశారు. అందువల్ల ఆన్‌లైన్‌లో రీచార్జి చేసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
ఇక జియోలో రూ.247కు ఇదే ప్లాన్ లబిస్తోంది. ఎయిర్‌టెల్‌లో దీన్ని రూ.299కు అందిస్తారు. ఈ రెండు ప్లాన్లలో వరుసగా 25, 30 జీబీ డేటా వస్తుంది. రెండింటికీ 30 రోజుల వాలిడిటీ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.