మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని తన వినియోగదారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్‌ను ఎంఐ హోమ్స్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఐ10ఐ ఫోన్, ఎంఐ టీవీ 4ఎ 32 హారిజాన్ ఎడిషన్, రెడ్‌మీ 9 పవర్ వంటి డివైస్‌లను ఫ్లాష్ సేల్‌లో కేవలం రూ.1కే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ సేల్‌లో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ 10టి ప్రొ ఫోన్‌ను రూ.13వేల డిస్కౌంట్‌తో విక్రయించనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. సేల్‌లో భాగంగా ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్, రెడ్‌మీ నోట్ 9 వంటి డివైస్‌లను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
సేల్‌లో భాగంగా రూ.10వేలకు పైబడిన వస్తువులను కొనుగోలు చేస్తే గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. పలు వస్తువులపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. ఇంకా అనేక ఆఫర్లను ఈ ఫెస్టివల్‌లో అందివ్వనున్నారు.