టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. జియోలో ఇప్పటి వరకు ఉన్న ప్లాన్లపై అందించే డేటాకు రోజు వారీ లిమిట్‌ను విధించారు. అంటే రోజుకు 1జీబీ, 1.5జీబీ, 2, 3 జీబీ చొప్పున మాత్రమే డేటాను ఉపయోగించుకునేందుకు వీలుండేది. డేటా లిమిట్ దాటితే మళ్లీ 24 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జియో అపరిమిత డేటా ప్లాన్స్‌ను ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జియో ప్రకటించిన అపరిమిత డేటా ప్లాన్స్‌లో భాగంగా రూ.127తో రీచార్జి చేసుకుంటే 15 రోజుల వాలిడిటీతో 12 జీబీ డేటా వస్తుంది. 15 రోజుల్లోగా ఆ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే రూ.247 ప్లాన్‌తో 25జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌కు 30 రోజుల వాలిడిటీని నిర్ణయించారు. ఆలోగా 25 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగే రూ.447 నుంచి రూ.2,397 వరకు వివిధ రకాల అపరిమిత డేటా ప్లాన్స్ ను జియో ప్రవేశ పెట్టింది.
జియో ఈ ప్లాన్లను నో డెయిలీ లిమిట్ విభాగం కింద అందుబాటులో ఉంచింది. వీటిని ప్రీపెయిడ్ యూజర్లు రీచార్జి చేసుకోవచ్చు. రూ.447 ప్లాన్‌లో 50జీబీ డేటా వస్తుంది. దీన్ని 60 రోజుల్లోగా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్లన్నింటిలోనూ రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. జియో యాప్స్‌ను ఉచితంగా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…