స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా కొత్తగా మోటోజి60, మోటోజి40 ఫ్యుషన్ పేరిట రెండు ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో 6.8 ఇంచుల మాక్స్ విజన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్ను, 6జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వీటిలో లభిస్తుంది. వీటిల్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 20 వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
జి60 ఫోన్‌లో వెనుక వైపు 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. జి40 ఫ్యుషన్ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండింటికీ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు.
మోటో జి60, మోటో జి40 ఫ్యుషన్ స్మార్ట్ ఫోన్లు డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపేన్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. మోటో జి60కి చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు.
మోటో జి40 ఫ్యుషన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ ఫోన్‌లను విక్రయిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి.
లాంచింగ్ సందర్భంగా జి40 ఫ్యుషన్ ఫోన్ పై రూ.1000, జి60 ఫోన్‌పై రూ.1500 వరకు ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. దీంతో తగ్గింపు ధరలకు ఈ ఫోన్లు లభిస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…