షియోమీ కంపెనీ ఎంఐ టీవీ 4ఏ హరైజాన్ ఎడిషన్ 40 పేరిట ఓ నూతన స్మార్ట్ టీవీని భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వివిద్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో ప్యాచ్ వాల్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో కంటెంట్‌ను పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్స్‌ను ఈ టీవీలో ఉపయోగించుకోవచ్చు.
ఈ టీవీలో ఎంఐ క్విక్ వేక్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మూవీని ఎక్కడ పాజ్ చేశారో అక్కడి నుంచి చూడడం కొనసాగించవచ్చు. ఈ టీవీలో బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ లభిస్తుంది. డేటా సేవర్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఎంఐ టీవీ 4ఏ హరైజాన్ ఎడిషన్ 40 ఇంచ్ టీవీ ఫీచర్లు
- 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ యామ్‌లాజిక్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ టీవీ 9.0
- ప్యాచ్‌వాల్, 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఎంఐ క్విక్ వేక్, వైఫై, బ్లూటూత్ 4.2
- హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథర్‌నెట్, డీటీఎస్ హెచ్‌డీ సపోర్ట్
ఎంఐ టీవీ హరైజాన్ ఎడిషన్ 40 టీవీ ధర రూ.23,999 ఉండగా, దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోలు, రిటెయిల్ పార్ట్‌నర్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.