ఏసర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సారిగా జీ ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. అదే ఏసర్ స్పిన్7 ల్యాప్ టాప్. ఇందులో 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 360 డిగ్రీల కోణంలో ఈ డిస్ ప్లే తిరగనుంది. ఈ సందర్భంగా ఏసర్ కంపెనీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా 5 జీ ల్యాప్ టాప్ ఇదేనని ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ ప్లాట్‌ఫాంను అందించారు.
ఏసర్ స్పిన్ 7 ధర మనదేశంలో .1,34,999గా ఉంది. ఈ అధునాతన ల్యాప్ టాప్ లు ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్టీమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంది. ఈ ఒక్క కలర్ వేరియంట్ ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది.
ఈ 5 జీ ల్యాప్ టాప్ లో 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 56WHR బ్యాటరీని అమర్చారు.ఏసర్ స్పిన్ 7 టచ్ జెస్చర్లను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.59 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.