ప్రపంచం ఓ వైపు 5జి టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది. కానీ మన దేశంలో మాత్రం ఇంకా 3జి నెట్‌వర్కే సరిగ్గా అందుబాటులో లేదు. కాల్ చేసినా, కాల్ వచ్చినా వెంటనే డ్రాప్ అవుతుంది. మళ్లీ కాల్ చేస్తే త్వరగా కనెక్ట్ అవదు. దీనికి తోడు మొబైల్ డేటా సరేసరి. ఎంత ప్రయత్నించినా స్పీడ్ సరిగ్గా రాదు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. చాలా వరకు ఫోన్లలో సిమ్ వేయగానే నెట్‌వర్క్ ఆటోమేటిగ్గా డిటెక్ట్ అయి సెట్టింగ్స్ సేవ్ అవుతాయి. కానీ కొన్ని సార్లు ఇలా జరగదు. దీంతో ఫోన్‌లో నెట్ సరిగ్గా పనిచేయదు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులోని నెట్‌వర్క్ సెట్టింగ్స్ అనే విభాగంలో ప్రిఫర్డ్ టైప్ ఆఫ్ నెట్‌వర్క్‌ను 4జి లేదా ఎల్‌టీఈగా సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో నెట్ వర్క్ సెట్టింగ్స్ సేవ్ అవుతాయి. నెట్ స్పీడ్‌గా వస్తుంది.
2. నెట్ స్పీడ్ సరిగ్గా రాకపోతే నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లోని ఏపీఎన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో ఏపీఎన్ టైప్, ఏపీఎన్ ప్రోటోకాల్ వివరాలను మార్చాలి. ఐపీవీ4/ఐపీవీ6 ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత ఏపీఎన్ రోమింగ్‌లోనూ ఐపీవీ4/ఐపీవీ6 ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత ఓకేపై ట్యాప్ చేయాలి. దీంతో సెట్టింగ్స్ సేవ్ అవుతాయి.
3. ఫోన్‌లో ఎప్పటికప్పుడు యాప్స్‌కు చెందిన క్యాచె పేరుకుపోవడం వల్ల కూడా నెట్ స్పీడ్ స్లో అవుతుంది. అందుకుగాను క్యాచెను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. మీరు రెగ్యులర్‌గా వాడే యాప్స్‌కు చెందిన క్యాచెను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను సెట్టింగ్స్‌లో యాప్‌ను సెలెక్ట్ చేసుకుని అందులో వచ్చే ఆప్షన్లలో క్లియర్ క్యాచె అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఆ యాప్‌కు చెందిన క్యాచె క్లియర్ అవుతుంది. అలాగే రెగ్యులర్‌గా వాడే ఇతర యాప్‌లకు చెందిన క్యాచెను కూడా క్లియర్ చేయాలి. దీంతో నెట్ స్పీడ్ పెరుగుతుంది.
4. ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా యాప్స్ వల్ల కూడా నెట్ స్పీడ్ స్లో అవుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్ లు బ్యాక్‌గ్రౌండ్‌లోనూ రన్ అవుతుంటాయి. దీంతో నెట్ స్పీడ్ తగ్గుతుంది. అయితే ఆయా యాప్‌లకు చెందిన సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటో ప్లే, డౌన్‌లోడ్ అనే ఆప్షన్లను డిజేబుల్ చేయాలి. దీంతో నెట్ ను ఆ యాప్స్ ఎక్కువగా వినియోగించుకోవు. ఫలితంగా స్పీడ్‌ను పెంచుకోవచ్చు.
5. ఫోన్లలో ఉండే ఇంటర్నెట్ బ్రౌజర్లను వాడుతున్నప్పుడు వాటిల్లో ఉండే డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేయాలి. దీంతో నెట్ తక్కువగా వినియోగం అవుతుంది. నెట్ స్పీడ్ పెరుగుతుంది.
ఈ సూచనలు పాటించడం వల్ల ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…