ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. దసరా సందర్భంగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. ఇందులో భాగంగా అనేక రకాల ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లను, డిస్కౌంట్లను అందివ్వనున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు రాయితీని పొందవచ్చు. పేటీఎం నుంచి అయితే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. ఇక అర్హులైన కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.70వేల వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. దీంతో వస్తువులను కొనుగోలు చేసి ఈఎంఐ పెట్టుకోవచ్చు. మొత్తాన్ని 3, 6, 9, 12 నెలసరి వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఇక యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకులకు చెందిన కస్టమర్లు ప్రత్యేక ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. ఈ క్రమంలోనే అర్హులైన కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో అందిస్తోంది. దీంతో ఫ్లిప్ కార్ట్‌లో కొనే వస్తువులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ సేల్‌లో ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, కిచెన్, ఫర్నిచర్ ఉత్పత్తులు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, బొమ్మలు, బేబీ కేర్ ఉత్పత్తులు, కిరాణా సరుకులపై ఆఫర్లను అందివ్వనున్నారు. అలాగే టీవీలను చాలా తక్కువ ధరలకు అందివ్వనున్నారు. ల్యాప్ టాప్‌లపై డిస్కౌంట్ ధరలను పొందవచ్చు.