---Advertisement---

రూ.3,190 కే ఎయిర్ ట్యాగ్ లాంచ్ చేసిన ఆపిల్!

April 22, 2021 10:35 PM
---Advertisement---

ప్రముఖ యాపిల్ సంస్థ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్‌ను లాంచ్ చేసింది. ఈ ట్రాకర్స్‌ను ఏ వస్తువుకైనా అతికించి పెట్టినప్పుడు వాటిని మనం మిస్ చేసుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియజేస్తాయి.ఈ ట్రాకర్స్‌ ద్వారా ఆ వస్తువులను మనం ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.ఆపిల్ కంపెనీ ఈ ట్రాకర్స్‌ ను సింగిల్ ప్యాక్, ఫోర్ ప్యాక్‌లో వీటిని అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించిన సేల్స్ ఇండియాలో ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయి.

సింగిల్ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్‌ ధర రూ 3,190 గా నిర్ణయించారు. అదేవిధంగా 4 ట్రాకర్స్‌ ధర రూ.10,990గా ఉంది.వీటిలో అల్ట్రా వైడ్‌బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనం మిస్ చేసుకున్న వస్తువులను తొందరగా గుర్తించగలం. అదే విధంగా ఇందులో యూ1 చిప్‌ను అమర్చడం వల్ల వీటిని ఐఫోన్, ఐ పాడ్, ఆపిల్ వాచ్ వంటి వస్తువులను కనిపెట్టడానికి ఉపయోగించవచ్చు.

ఈ ట్రాకర్స్‌ను ఐఫోన్ దగ్గరికి తీసుకు వచ్చి వీటిని కనెక్ట్ చేయడం ద్వారా ఇందులో ఉన్న ఫైండ్ మై యాప్ ద్వారా ఈ ఎయిర్ ట్యాగ్స్ ప్రస్తుత, చివరి లోకేషన్ చూడవచ్చు. కెమెరా, ఏఆర్‌కిట్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్ వంటి వాటి ద్వారా మనం పోగొట్టుకున్న వస్తువులను ఇవి కని పెడతాయి.నెట్ వర్క్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని యాపిల్ తెలిపింది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now