కరోనా కారణంగా భారత్‌లో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 ను యూఏఈలో నిర్వహిస్తున్న విషయం విదితమే. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆ టోర్నీ జరగనుంది. దీంతో ఆ టోర్నీలో జరగనున్న భారత్, పాకిస్థాన్‌పై ఇప్పటి నుంచే అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో అందరూ ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్‌తో సంబంధాలు దెబ్బ తిన్నాక ఆ దేశం మన దగ్గర, మన వాళ్లు అక్కడ మ్యాచ్‌లను ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్‌లలోనే పాక్‌తో భారత్ ఆడుతోంది. అయితే త్వరలో మరో ఐసీసీ ఈవెంట్‌లో ఈ రెండు దేశాలూ తలపడనుండడంతో అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదే విషయమై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ స్పందిస్తూ.. ఈసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌పై కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌పై పైచేయి సాధిస్తామన్నాడు. అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తామని అన్నాడు.
అయితే భారత అభిమానులు మాత్రం బాబర్ అజమ్ కామెంట్లను లైట్ తీసుకుంటున్నారు. భారత్ ను ఓడించడం మీ వల్ల కాదని, బాబర్ అజమ్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…