ఆడవాళ్లు అదృష్టవంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారి శరీరంలోని 32 భాగాల్లో కొన్ని కరెక్ట్ గా ఉంటే అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. అందం కంటే కూడా ఆడవాళ్లలో ఈ రాతలు, పోలికలు చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. అసలు ఆడవారి బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనడానికి కారణం ఏమిటంటే.. వారి జీవితం మగవారితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు వివాహం చేసుకున్న మగవాడి రాతను బట్టి జీవితమనేది కొనసాగుతుంది కాబట్టి. ఆ రాతలే అదృష్ట రేఖలు, పోలికలు. ఇప్పుడు చెప్పబోయే రేఖలు, పోలికలు మీకు ఉంటే ఏదో ఒక సమయంలో మీకు అదృష్టం కచ్చితంగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ లక్కీ సైన్స్ ఏంటో మనం చూద్దాం.
ముందుగా ఆడవారి వల్ల కలిసొచ్చే అదృష్టం ఎలాగా ఉంటుంది అని చెప్పుకోవాలి అంటే వారి రూపురేఖలు బట్టి తెలుస్తుంది. ఆడవారుకు నుదురు భాగం ఎక్కువగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. అది ఎలా అంటే బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి జుట్టు ఉండే వరకు ఎంత విశాలంగా ఉంటే వారు అంత అదృష్టవంతులని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా ఆడవారికి నుదుటిమీద గీతాలు బట్టి కూడా జీవిత కాలాన్ని, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. అది ఎలా అంటే నుదుటి మీద ఒక గీత ఉన్నవారు 40 సంవత్సరాలు, రెండు గీతలు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు, మూడు గీతలు ఉన్నవాళ్లు 70 ఏళ్లకు పైబడి జీవిస్తారు. ఇలా నుదుటి మీద గీతలు ఉన్నవారు కూడా అదృష్ట జాతకులే. ఆడవారిలో మరుకొన్ని లక్కీ ఫ్యూచర్స్ గా కనిపించే లక్షణాలు ఏంటంటే.. రెండు కనుబొమ్మల మధ్యలో ఎక్కువగా వెంట్రుకలు ఉన్నవారు, రెండు కనుబొమ్మల మధ్య దూరం ఎక్కువగా ఉన్నవారు కూడా అదృష్ట జాతకులని, వారు ఉన్న ఇంటిలో సంపద అధికంగా కలిసి వస్తుంది. అదేవిధంగా కనుబొమ్మలు బాణం లాగా షార్ప్ గా ఉంటే వారికి ఆదాయం, ఆయుష్షు ఎక్కువ. అదేవిధంగా కనురెప్పలు నుదురు మీదకు త్రిశూలం ఆకారంలో నిలబడి ఉన్నట్లు ఉంటే వారి జీవితంలో రాజయోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక కళ్ళు పెద్దగా ఉండే ఆడవారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. వీరికి అదృష్టం తక్కువైనా కూడా సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. కళ్ళు పెద్దగా ఉండే ఆడవారిలో ఆదాయం కంటే గౌరవం మర్యాదలు సమాజంలో ఎక్కువగా ఉంటాయి. పొడవైన కళ్ళు కలవారు అసూయతో పాటు ఆదాయం కూడా ఎక్కువగా సంపాదిస్తారు. పొడవైన కళ్ళు ఉన్న వారిలో రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆడవారి అదృష్టాన్ని కలిగించే పోలికల్లో చెప్పుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే దవడ ఎముక. ఆడవారిలో ఎడమవైపు ఉండే దవడ ఎముక నెలవంక మాదిరిగా వంగి ఉన్నట్లయితే వారు లక్కీ వుమెన్. వారి జీవితంలో అనుకున్న పనిని కచ్చితంగా చేసి తీరుతారు. ఇక ఆడవారి చిటికెన వేలుకు, ఉంగరం వేలుకు మధ్య గ్యాప్ ఉంటే వీరు కూడా అదృష్టం కలిగిన వారిగా చెప్పవచ్చు. వీరు ఎక్కడ ఉన్నా ఆధిపత్యం వహిస్తారు. చూపుడువేలు కంటే ఉంగరం వేళ్ళు పొడుగ్గా ఉండే ఆడవారికి జీవితంలో తిరిగే ఉండదు. వారు చనిపోయేంతవరకు కూడా వారికి కావలసిన దానికన్న కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించుకుంటారు.
ఆడవారి రూప రేఖలలో అదృష్టాన్ని కలిగజేసే విషయంలో ముందుండేవి పాదాలు. బొటనవేలు మినహా దాని పక్కన వేలు దగ్గర్నుంచి ఒక్కొక్క వేలు చిన్నగా ఉంటూ ఒక ఆర్డర్ వైస్ గా కిందకు ఉంటే వారు చాలా అదృష్టవంతులని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. మరి ఈ పోలికలు మీలో కూడా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…