కోడిగుడ్లను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా తింటుంటారు. కొందరు ఆమ్లెట్లు అంటే ఇష్టపడతారు. కొందరు ఎగ్ ఫ్రై, ఎగ్ రైస్ చేసుకుని తింటారు. ఇక కొందరు గుడ్లను ఉడకబెట్టుకుని తింటారు. అయితే గుడ్లను ఉడకబెట్టి తినడమే ఉత్తమమని వైద్యులు చెబుతుంటారు. అయితే గుడ్లను ఉడకబెడితే వాటి పొట్టు తీసేందుకు కొన్ని సార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి అలాంటి సమయాల్లో సులభంగా గుడ్ల పొట్టును ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సాధారణ నీటిలో వేసి చాలా మంది గుడ్లను ఉడకబెడతారు. అయితే ముందుగా నీటిని బాగా మరిగించాలి. తరువాత అందులో గుడ్లను వేయాలి. దీంతో గుడ్లు త్వరగా ఉడకడమే కాదు, అవి ఉడికాక పొట్టు సులభంగా వస్తుంది.
2. గుడ్లను ఉడికిన తరువాత 15 నిమిషాల పాటు బాగా చల్లని నీటిలో ఉంచాలి. టైం ఉంది, వెయిట్ చేస్తాం అనుకుంటే ఈ మెథడ్ పాటించవచ్చు. దీంతో పొట్టు సులభంగా వస్తుంది.
3. నీటిలో బేకింగ్ సోడాను కొద్దిగా వేసి గుడ్లను ఉడకబెట్టాలి. దీంతో కోడిగుడ్ల పొట్టు సులభంగా వస్తుంది.
4. ఉడికిన కోడిగుడ్డను బల్లపై ఉంచి దానిపై అరచేయి పెట్టి దాన్ని చేత్తో దొర్లిస్తుండాలి. ఇలా చేస్తే పొట్టు సులభంగా వస్తుంది.
5. ఒక గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి అనంతరం అందులో ఉడకబెట్టిన గుడ్డును వేయాలి. తరువాత చేత్తో గ్లాస్ మూతిని మూయాలి. అనంతరం ఆ గ్లాస్‌ను షేక్ చేయాలి. దీంతో కోడిగుడ్డు పొట్టు సులభంగా వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…