ఆఫ్‌బీట్

Lanke Bindelu: లంకె బిందెల‌ను తెరిస్తే అరిష్ట‌మా ? నోట్లో నుంచి ర‌క్తం వ‌చ్చి చ‌నిపోతారా ?

Lanke Bindelu: లంకె బిందెలు.. వీటి గురించి అంద‌రికీ తెలుసు. రెండు లోహాల‌తో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా వ‌జ్రాలు, ర‌త్నాలు లేదా ఇత‌ర విలువైన వ‌స్తువులు ఉంటాయి. వీటిని పాతిపెడితే మ‌ళ్లీ ఎప్పుడో ఎవ‌రికో ల‌భిస్తుంటాయి. అప్పుడ‌ప్పుడు మ‌నం లంకె బిందెలు దొరికిన వార్త‌ల‌ను కూడా చ‌దువుతుంటాం. అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయ‌కూడ‌ద‌ని, అరిష్ట‌మ‌ని, వాటిని తీస్తే ర‌క్తం నోట్లో నుంచి వ‌చ్చి చ‌నిపోతార‌ని కొందరు చెబుతుంటారు. అయితే ఇది నిజ‌మేనా ? అంటే..

లంకె బిందెల‌ను స‌హ‌జంగానే రాగి, ఇత్త‌డి వంటి లోహాల‌తో త‌యారు చేస్తారు. ఇక వాటిల్లో ఉండే ఆభ‌ర‌ణాలు కూడా లోహాలే. క‌నుక అవి ఎక్కువ కాలం పాటు ఎలాంటి వాతావ‌ర‌ణంలో ఉన్నా ఆ ప్ర‌భావం వ‌ల్ల రంగు మారుతుంటాయి. ఇక భూమిలో అవి ఉంటే వాటికి గాలి సోకే మార్గం ఉండ‌దు. దీంతో అవి క్ష‌యానికి గురై వాటి నుంచి గాలి బ‌య‌టికి పోక అక్క‌డే ఉంటుంది.

ఈ క్ర‌మంలో అలాంటి లంకె బిందెల‌ను తీసిన‌ప్పుడు ఒక్క‌సారిగా ఘాటైన వాస‌న‌లు వ‌స్తాయి. అవి ఒక్కోసారి విష‌పూరితంగా ఉంటాయి. కొన్ని సార్లు ఉండ‌వు. ఆ వాస‌న‌లు కొంద‌రికి ప‌డ‌వు. దీంతో వాటిని పీల్చ‌గానే ఊపిరి ఆడ‌క‌పోవ‌డం, త‌ల‌తిర‌గ‌డం, వాంతికి రావ‌డం, నోరు, ముక్కుల్లోంచి ర‌క్తం రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇవి అంద‌రిలోనూ క‌నిపించాల‌ని ఏమీ లేదు. వాస‌న‌లు ప‌డ‌క‌పోతే అలా జ‌రుగుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో లంకె బిందెల‌ను తీస్తే ఎవ‌రికైనా అలా జ‌రిగితే నిజంగానే ఆ బిందెల‌ను తీయ‌డం వ‌ల్ల అరిష్టం క‌లిగిందేమోన‌ని భావిస్తుంటారు. కానీ నిజానికి అది అరిష్టం కాదు.

ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఆ బిందెలు భూమి లోపల ఉంటే అవి క్ష‌యానికి గురై అక్క‌డ విష వాయువులు నిండిపోతాయి. అవి ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌స్తే వాటిని వాస‌న పీలిస్తే అలా జరుగుతుంది. అంతేకానీ.. ఆ బిందెల‌ను తీయ‌డం వ‌ల్ల ఎలాంటి అరిష్టం ఉండ‌దు. కాక‌పోతే ఎవ‌రికైనా అలా బిందెలు దొరికితే వాటిని తీసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటిస్తే మంచిది. ముక్కుకు ఏదైనా అడ్డు పెట్టుకుని తీస్తే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అందువ‌ల్ల లంకె బిందెల‌ను తీయ‌డం వల్ల ఎలాంటి అరిష్టం రాద‌ని తెలుసుకోవాలి. దాని వెనుక పైన తెలిపిన కార‌ణాలు ఉంటాయి క‌నుక‌నే చాలా మందికి అలా జ‌రుగుతుంటుంది.

ఇక కొన్ని సార్లు లంకె బిందెలు దొరికాయ‌న్న ఆనందంతో కొంద‌రికి బీపీ ఎక్కువ‌గా పెరిగిపోతుంది. దీని వ‌ల్ల స‌హ‌జంగానే మెద‌డులో ర‌క్త‌నాళాలు చిట్లి ర‌క్తం బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌నిపోతారు. అలాగే కొంద‌రికి ఆనందం ప‌ట్ట‌లేక హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. కానీ ఇలా చాలా అరుదుగా జ‌రుగుతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM