కిరాణా షాపులలో ఏవైనా వస్తువులను కొనేందుకు వెళితే మనకు వింతైన అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు షాపు వారు మనకు చిల్లర ఎక్కువ ఇస్తారు. పొరపాటుగా అలా చేస్తారు. లేదా మనమే కొన్నిసార్లు డబ్బు మరిచిపోయి వస్తుంటాం. అయితే కొందరు షాపుల వాళ్లు మాత్రం మనం కరెన్సీ నోట్లను ఇచ్చినా ఇవ్వలేదని దబాయిస్తారు. కావాలంటే మీరు ఇచ్చిన నోటును చూపించండి.. అని బుకాయిస్తారు. ఇలా చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి.
అయితే కేవలం కిరాణా షాపుల వద్దే కాదు, ఇతర చోట్ల కూడా ఇలాంటి అనుభవాలే చాలా మందికి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. డబ్బులు ఇచ్చినా వారు ఇవ్వలేదని బుకాయిస్తారు. దీంతో చేసేది లేక కొందరు మళ్లీ డబ్బులు ఇస్తారు. అయితే కొందరు మాత్రం గొడవ పెట్టుకుంటారు. అది తారాస్థాయికి వెళ్తుంది. కానీ ప్రయోజనం ఉండదు.
అయితే ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఎదురుకావచ్చు. కనుక అలాంటి సందర్భాల్లో మనం సులభంగా పైచేయి సాధించడం కోసం ఒక చిన్నా సలహాను పాటించాలి. అదేమిటంటే..
కిరాణా షాపు అనే కాదు.. ఎక్కడికి వెళ్లినా సరే మీరు ఇచ్చే నోట్లకు చెందిన చివరి 3 అంకెలను గుర్తు పెట్టుకోండి. అలా గుర్తు పెట్టుకుంటే వారు మిమ్మల్ని మోసం చేయలేరు. నోట్ల గురించి అడిగితే మీరు వాటికి చెందిన నంబర్లను చెప్పవచ్చు. దీంతో తప్పు ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ విధంగా అలాంటి ఘటనలు ఎదురుకాకుండా తెలివిగా వ్యవహరించవచ్చు. అయితే అందరూ ఇలా మోసం చేస్తారని కాదు, కానీ కొందరు చేస్తారు కదా.. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ విధంగానే చేయాలి..!!