పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

January 15, 2026 9:13 PM

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి అదృష్టం కలిసోచ్చింది. ఒక్కసారిగా జాక్ పాట్ తగలడంతో ఆ గిరిజన బిడ్డ ఆనందానికి అవ‌ధులు లేవు. వివ‌రాల‌లోకి వెళితే తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది. తోటి కూలీలు చూసి అది వజ్రమే అని చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.

రైతు కూలీకి వజ్రం దొరికిందన్న విషయం తెలియడంతో.. ఆ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూకట్టారు. కొంతమంది వ్యాపారులు ఆ వజ్రాన్ని పరిశీలించి.. అది 8 క్యారెట్లు ఉన్నట్లుగా తేల్చారు. కొంతమంది వ్యాపారులు ఈ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఆ రైతు కూలీ మాత్రం తనకు మంచి ధర చెల్లిస్తేనే ఇస్తానని చెప్పగా.. తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. చివరికి పెరవలికి చెందిన వ్యాపారి రైతు కూలీకి రూ.5లక్షలు ఇచ్చి వ‌జ్రాన్ని కొనుగోలు చేశారు. వజ్రం దొరకడంతో రైతుకూలీకి రూ.5లక్షల ఆదాయం వచ్చింది.. అయితే 8 క్యారెట్ల వజ్రాన్ని ఆ వ్యాపారి ఎక్కువ రేటుకే అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అలాగే గతవారం కూడా మరో రైతు కూలీకి వజ్రం దొరికింది.

farmer found diamond in his farm at tuggali

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా తుగ్గ‌లి రైతు పొలంలో ఈ వ‌జ్రం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలోని ప‌లువురు రైతుల‌కు ఇలాగే వ‌జ్రాలు దొరికాయి. వ‌ర్షకాలం మొద‌లుకాగానే తొలక‌రి స‌మ‌యంలో భారీ ఎత్తున జ‌నాలు తుగ్గ‌లిలో వ‌జ్రాల వేట‌కు వ‌స్తుంటారు.గతంలో విలువైన వజ్రాలు రూ.కోటి పిలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, అగ్రహారం, హంప, యడవలి, కొత్తపల్లి, మద్దికెర ప్రాంతాల్లో వజ్రాల కోసం గాలిస్తుంటారు. అలాగే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు, పొట్టిపాడు, గంజికుంట, తట్రకల్లు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌ఎంపీ తండా ప్రాంతాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now