India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆఫ్‌బీట్

Dreams : మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు.. వాటి గురించిన ఆసక్తికర విషయాలు ఇవే..!

IDL Desk by IDL Desk
Friday, 14 April 2023, 7:00 AM
in ఆఫ్‌బీట్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Dreams : నిద్రపోతే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. కానీ కొన్ని రకాల కలలు మాత్రం మనలో అధిక శాతం మందికి సాధారణంగా తరచూ వస్తూనే ఉంటాయి. నిపుణలు చెబుతున్న ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి కలలు వస్తాయట. వారి వ్యక్తిత్వం, నడవడిక ఇత్యాది అంశాల మేళవింపుతో కూడినవై కలలు ఉంటాయి.

అయితే ఇదే సమయంలో కలలు కొన్ని విషయాలను కూడా మనకు చెబుతుంటాయి. మనం భయపడుతున్న, నిర్లక్ష్యంగా వదిలేస్తున్న విషయాలను ప్రతిబింబించే విధంగా కలలు వస్తాయి. అసలు మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు ఏమిటి..? వాటి గురించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఎత్తయిన భవంతి నుంచి లేదా లోయ వంటి ప్రదేశంలోకి పడి పోతున్నట్టుగా కల వస్తే మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్టు భావించాలి. ఈ సమస్య పని, సంబంధ బాంధవ్యాలు, లేదా ఇతర వేరే ఏ విషయానికి సంబంధించిందైనా అయి ఉండవచ్చు. స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ వంటి ప్రదేశాల్లో అందరికీ మీరు నగ్నంగా కనిపిస్తున్నట్టు కల వస్తే అది మీకు ఉన్న తొందర, ఆతృతను తెలియజేస్తుంది. సాధారణంగా కొత్త ప్రదేశంలోకి వెళ్లబోతున్న వారికి, ప్రమోషన్ వచ్చిన ఉద్యోగులకు, కొత్త ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి.

Dreams and their meanings
Dreams

ఏదైనా పరీక్ష రాస్తున్నట్టు కల వస్తే అది మీరు ఒత్తిడికి గురవుతున్నారని సూచిస్తుంది. సాధారణంగా స్కూల్‌లో చదివే విద్యార్థులకు, ఆఫీస్‌లలో ఎక్కువగా పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి. ఇవి మీరు ఒత్తిడికి లోనవుతుండడాన్ని సూచిస్తాయి. ఎవరైనా సెలబ్రిటీని కలిసినట్టు కల వస్తే మీలో ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతున్నట్టు భావించాలి. మంచి పేరు, గుర్తింపు కోసం మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఈ కల అసలు రాకూడదంటారు. అదేనండీ చనిపోతున్నట్టు వచ్చే కల. ఇలా వస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సంబంధం, ఉద్యోగం లేదా వేరే ఏదైనా విషయానికి శాశ్వతంగా ముగింపు పలకాలని భావిస్తున్నట్టు అర్థం. కొత్త జీవితం కోసం ఆరాటపడుతున్న వారికి కూడా ఇలాంటి కలలు వస్తాయి. అయితే కొన్ని వర్గాల్లో మాత్రం చనిపోతున్నట్టు కల వస్తే మంచిదేనని, అది ఆ వ్యక్తికి దీర్ఘాయువునిస్తుందని నమ్ముతారు.

ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే మీరు ఎదుర్కొంటున్న ఏదో ఓ సమస్యను కొంత సేపు పక్కన పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి కలలు సాధారణంగా పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తాయట. మీ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కల వస్తే అది మీ భాగస్వామి మీ పట్ల చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియజేస్తుంది. ఇదేకాకుండా బీ భాగస్వామిపై మీరు నమ్మకం కోల్పోతే కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్లినట్టు కల వస్తే తరువాత రోజు ఆ వ్యక్తి నిర్దిష్ట సమయానికల్లా ఏదైనా ముఖ్యమైన ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాలని అర్థం. అయితే ఎల్లప్పుడూ ఆలస్యంగా వెళ్లే వారికి ఈ కలలు ఎక్కువగా వస్తాయట.

దంతాలు ఊడిపోయినట్టుగా కల వస్తే కొందరు దీన్ని అపశకునంగా, మరికొందరు శుభంగా భావిస్తారు. ఈ కల వచ్చిన వ్యక్తుల్లో కొందరు తమకు పట్టుదల, శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయని భావిస్తారు. మరికొందరు తమ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అనుకుంటారు. మహిళలల్లో ఇలాంటి కలలు వస్తే వారు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అదే పురుషుల్లో అయితే లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకోవాలి.

పాములు కనపడినట్టు కల వస్తే ఆ వ్యక్తి తనను తాను మార్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాములు కొద్ది రోజులకు ఒకసారి తమ చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయిగా. అలాగే వ్యక్తులు కూడా తమను తాము కొత్త వ్యక్తిత్వానికి మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని అనేక మంది శుభంగానే భావిస్తారు.

Tags: dreams
Previous Post

Mother And Child : బిడ్డ జన్మించిన అనంతరం తల్లులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు..!

Next Post

Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
Samantha : సమంత అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. పండగ చేసుకునే విషయం..!
వార్తా విశేషాలు

Samantha : సమంత అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. పండగ చేసుకునే విషయం..!

by Sailaja N
Friday, 8 October 2021, 7:12 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.