ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలా మంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరి ఇళ్లల్లో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును.. గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
టాయిలెట్ సీట్స్‌ను సాధారణంగా పోర్సిలెయిన్ అనే సెరామిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అది సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది. దానికి ఇతర రంగులను కలపాల్సిన పనిలేదు. పైగా అలా ఉంచితేనే తక్కువ ధర ఉంటాయి. రంగులు కలిపితే ధర పెంచాల్సి వస్తుంది. అందుకని వాటిని తయారు చేశాక వాటికి వచ్చే సహజమైన తెలుపు రంగులోనే వాటిని ఉంచుతారు. అలాగే విక్రయిస్తారు. అందుకనే టాయిలెట్ సీట్లు సహజంగానే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి.
ఇక తెలుపు కాకుండా మిగిలిన ఏ రంగుల్లో టాయిలెట్ సీట్లు ఉన్నా సరే వాటిపై మురికి సరిగ్గా కనిపించదు. తెలుపు రంగు అయితేనే మురికి సరిగ్గా కనిపిస్తుంది. పైగా తెలుపు రంగుతో ఉన్న టాయిలెట్ సీట్‌ను క్లీన్ చేస్తే అది తెల్లగా మెరుస్తుంది. దీంతో సంతృప్తి కలుగుతుంది. అదే ఇతర రంగుల్లో ఉండే టాయిలెట్ సీట్లను శుభ్రం చేసినా తెలుపులా మెరవవు. కనుక సీట్ శుభ్రం అయిందా, కాలేదా అనే విషయం గుర్తించడం కష్టతరం అవుతుంది. అందుకనే టాయిలెట్ సీట్లను సహజంగానే తెలుపు రంగులో ఉండేట్లు తయారు చేస్తారు. అలాగే విక్రయిస్తారు. అవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉండడం వెనుక ఈ కారణాలు ఉన్నాయన్నమాట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…