ఆఫ్‌బీట్

D-Mart : డి-మార్ట్ ఎంత తెలివిగా వ్యాపారం చేస్తుందో తెలుసా.. ధ‌ర త‌క్కువ ఎందుకు, ఆదాయం ఎలా వ‌స్తుంది..?

D-Mart : ఒక వ‌స్తువు మ‌నకు మార్కెట్‌లో ఎక్క‌డైనా త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందంటే చాలు.. మ‌నం అది ఎంత దూరం ఉన్నా స‌రే వెళ్లి అయినా కొనుక్కుంటాం. ఇక అన్ని ర‌కాల వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తే ఊరుకుంటామా.. అక్క‌డే మ‌న‌కు కావ‌ల్సిన అన్ని వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తాం. అది ఊరికి ఎంత చివ‌ర‌న ఉన్నా స‌రే.. నాలుగు రూపాయలు ఆదా అవుతాయంటే త‌ప్ప‌నిస‌రిగా ఆ ప్ర‌దేశాన్ని వెతుకుతూ వెళ్తాం. అవును.. ఎందుకంటే దేశంలో ఉన్న‌ది నూటికి 90 శాతం మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారే క‌దా. క‌నుక వారంద‌రూ డ‌బ్బు ఎంత వీలైతే అంత ఆదా చేసేందుకు య‌త్నిస్తారు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకుంది డి-మార్ట్‌. క‌నుక‌నే చిల్ల‌ర వ్యాపారంలోకి ఒక సంచ‌ల‌నంలా అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం దేశంలో వంద‌ల‌కు పైగా మార్ట్‌ల‌ను ఏర్పాటు చేసి క‌స్ట‌మ‌ర్ల అభిమానాన్ని చూర‌గొంటోంది.

అయితే డి-మార్ట్ గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. దీని గురించి చిన్న పిల్ల‌ల‌ను అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అక్క‌డ ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని అంటారు. వాస్త‌వ‌మే. మ‌న‌కు మార్కెట్‌లో ఉన్న వ‌స్తువుల ధ‌ర‌ల క‌న్నా కాస్త త‌క్కువ ధ‌ర‌కే డి-మార్ట్‌లో అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భిస్తాయి. క‌నుక‌నే డి-మార్ట్‌ల ద‌గ్గర ఎక్క‌డ చూసినా క‌స్ట‌మ‌ర్లు కిక్కిరిసిపోయి ఉంటారు. అయితే డి-మార్ట్ ఇంత‌గా స‌క్సెస్ అవ్వ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..? అన్న విష‌యాన్ని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

D-Mart

సాధారణంగా ఏ బిజినెస్ అయినా స‌రే 4 ప్ర‌ధాన అంశాల‌పై న‌డుస్తుంది. అది 1.ప్రొడ‌క్ట్‌, 2.ప్రైస్ (ధ‌ర‌), 3.ప్లేస్‌మెంట్ (ప్ర‌దేశం), 4.ప‌బ్లిసిటీ. ఎంబీఏ చ‌దివే వారికి సైతం ఇదే చెబుతారు. ఇది బేసిక్ రూల్‌. స‌రిగ్గా డి-మార్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు రాధాకిష‌న్ ద‌మాని కూడా ఇదే ఆలోచించారు. ఈ నాలుగు నియ‌మాల‌ను బాగా వంట బ‌ట్టించుకున్నారు. క‌నుక‌నే చిల్ల‌ర వ్యాపారంలో అనతి కాలంలో దూసుకుపోయారు. రిల‌య‌న్స్‌, బిగ్ బ‌జార్ లాంటి భారీ సంస్థ‌ల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇప్ప‌టికీ చిల్లర వ్యాపారంలో అగ్ర‌స్థానంలో ఉన్న‌ది ఎవ‌రు అంటే.. డి-మార్ట్ అని చెప్ప‌వ‌చ్చు.

సాధార‌ణంగా బ‌య‌ట ల‌భించే వ‌స్తువుల ధ‌ర క‌న్నా కాస్త త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను ఇస్తే ఎవ‌రైనా స‌రే ఎంత దూరంలో ఉన్నా వ‌చ్చి కొంటారు. క‌నుక‌నే డి-మార్ట్ ఇలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఇక్క‌డ పైన చెప్పిన 2, 4 నియ‌మాలు స‌రిపోతాయి. అంటే ధ‌ర త‌క్కువ‌.. పైగా మౌత్ ప‌బ్లిసిటీ ల‌భిస్తుంద‌న్న‌మాట‌. ఇక 1వ నియ‌మం.. ప్రొడ‌క్ట్‌. అంటే అన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఒకే చోట పెట్టి అమ్మ‌డం. దీంతో వివిధ ర‌కాల వ‌స్తువుల కోసం క‌స్ట‌మ‌ర్ ఇంకో షాప్‌కు వెళ్ల‌డు. అక్క‌డే అన్నీ కొంటాడు. దీన్ని కూడా డి-మార్ట్ ప‌క్కాగా అమ‌లు చేస్తోంది. త‌మ త‌మ స్టోర్‌ల‌లో అన్ని ర‌కాల వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తోంది. దీంతో 1వ నియ‌మం స‌రిపోయింది.

ఇక 3వ నియ‌మం ప్ర‌దేశం.. న‌ట్ట న‌డి సిటీలో మార్ట్ పెడితే దానికి రెంట్ బాగా ఎక్కువ‌వుతుంది. అది త‌గ్గాలంటే సిటీకి దూరంగా ఎక్క‌డో సొంత స్థ‌లం ఉండాలి. దీంతో అద్దె భారం ప‌డ‌దు. పైగా ధ‌ర త‌క్కువ పెట్టి, అన్ని ర‌కాల వ‌స్తువుల‌ను పెడితే.. సిటీకి ఎంత దూరంలో ఉన్నా స‌రే క‌స్ట‌మ‌ర్లు త‌ప్ప‌కుండా వ‌చ్చి కొంటారు. ఇదీ.. డి-మార్ట్ ధైర్యం. క‌నుక‌నే ఎక్క‌డ చూసినా దాదాపు డి-మార్ట్ స్టోర్‌లు అన్నీ శివారు ప్రాంతాల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంటాయి.

ఇలా బిజినెస్ కు చెందిన 4 నియ‌మాల‌ను రాధాకిష‌న్ ద‌మానీ అమ‌లు చేస్తున్నారు క‌నుక‌నే డి-మార్ట్ ద్వారా ఆయ‌న సక్సెస్ అయ్యారు. ఓ వైపు రిల‌య‌న్స్‌, మోర్‌, బిగ్ బ‌జార్ మాల్స్ అన్నీ మూతబ‌డుతుంటే.. మ‌రో వైపు డి-మార్ట్‌ల సంఖ్య మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే వ‌స్తోంది. ఇదంతా ఆ 4 రూల్స్‌ను పాటించ‌డం వ‌ల్ల‌నే అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఇలా చేస్తే డి-మార్ట్‌కు వ‌చ్చే ఆదాయం ఎలా.. అంటే.. అవును.. అయినా ఆదాయం వ‌స్తుంది. ఎలాగంటే.. ఒక వ‌స్తువును బ‌య‌ట క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు ఇస్తే డి-మార్ట్‌లో అమ్మ‌కాల సంఖ్య స‌హ‌జంగానే పెరుగుతుంది. బ‌య‌ట అదే వ‌స్తువును 100 యూనిట్లు అమ్మితే రేటు త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక‌ డి-మార్ట్‌లో ఒకే రోజు 10వేల యూనిట్లు అమ్ముతారు. దీంతో నేరుగా ఆ వ‌స్తువును త‌యారు చేసే కంపెనీతోనే డి-మార్ట్ ఒప్పందం కుదుర్చుకుంటుంది.

దీని వ‌ల్ల మ‌ధ్య‌వ‌ర్తి లేకుండా కంపెనీ నుంచి వ‌చ్చే మార్జిన్ నేరుగా డి-మార్ట్‌కే చేరుతుంది. దీంతో అటు కంపెనీ, ఇటు డి-మార్ట్ రెండు లాభ‌ప‌డ‌తాయి. ఇక క‌స్ట‌మ‌ర్‌కు కూడా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువు ల‌భిస్తుంది. క‌నుక త‌క్కువ ధ‌ర‌కే కొన్నాం అనే సంతృప్తి ఉంటుంది. ఇలా ఒక చెయిన్ రియాక్ష‌న్ జ‌రుగుతూనే ఉంటుంది. క‌నుక‌నే డి-మార్ట్ ఎలాంటి ఆటు పోట్లు లేకుండా నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉంది. ఇదీ.. వారి వ్యాపార ర‌హ‌స్యం.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే వ్యాపార రంగంలో రాణించ‌వ‌చ్చు. అందుకు డి-మార్ట్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి,…

Thursday, 16 May 2024, 4:05 PM

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM

Mangoes : మామిడి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కండి.. లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో జ‌నాలు అంద‌రూ చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.…

Tuesday, 14 May 2024, 8:11 PM

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ…

Tuesday, 14 May 2024, 5:01 PM

Gold Price Today : బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు..!

Gold Price Today : ఈమ‌ధ్య‌కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా పెరిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. అయితే…

Tuesday, 14 May 2024, 8:20 AM