Anand Mahindra : మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడు కూడా, ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతిభ ఉన్న వాళ్ళని, ప్రోత్సహించడంలో ఫస్ట్ ఉంటారు. అయినా అలాంటి వ్యక్తులకి అభిమానాన్ని, మద్దతుని కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఆసియా పారా గేమ్స్ బంగారు పతాక విజేత ఆర్చర్ శీతల్ దేవిని, ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.
ఆ పోస్ట్ ప్రస్తుతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్సె లో పోస్ట్ పెట్టిన ఆనంద్ మహేంద్ర, తమ కంపెనీ కార్లలో ఆమెకి నచ్చిన కారుని, తీసుకోవాలని కోరారట. దానిని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసి, ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. రెండు చేతులు లేని శీతల్ దేవి, ఆసియా పారా గేమ్స్ లో ఒకే ఒక ఎడిషన్ లో, రెండు గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నారు.

మొదటి భారతీయ మహిళగా, ఈమె విజయాన్ని అందుకున్నారు. జీవితంలో ఇంకెప్పుడు, చిన్నచిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్ దేవి, నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుండి ఎంతో నేర్చుకోవాలి అని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మా కంపెనీ కార్లలో నీకు నచ్చింది తీసుకో. దానిని నీకు నడపడానికి వీలుగా, తయారు చేసి ఇస్తాను అని ట్విట్టర్ లో రాసుకోచ్చారు ఆనంద్.
ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కి మంచి స్పందన వస్తోంది. చాలామంది, ఈ పోస్ట్ పై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ కి యూజర్ల నుండి మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్ మహేంద్రా ని అభినందిస్తున్నారు. ఇది చూస్తుంటే, ఆనంద్ మహేంద్ర మనసు ఎంత విశాలమో అర్ధం అవుతోంది.