Gold : మగువలకు బంగారంపై ఎంత మక్కువో అందరికీ బాగా తెలిసిన విషయమే. ఎంత ఎక్కువ బంగారం ధరిస్తే అంత స్టేటస్ సింబల్ గా భావిస్తారు మహిళలు. బంగారం ధరించడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు ఉండదు. పూర్వ కాలం నుంచి మన పెద్దవారు ఒక లోహాన్ని బాగా ఉపయోగించేవారు. ఆ లోహమే రాగి. రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అని పిలుస్తారు.
రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకంగా పనిచేస్తుంది. మానవుడు తొలి లోహంగా రాగినే ఉపయోగించేవాడు. రాగిని ధరించడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మన పెద్దలు సైతం ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి రాగి బిందెలో నీరు పోసుకుని తాగితే శరీరం గట్టిపడుతుంది అని చెబుతూ ఉంటారు. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఖనిజాలను అందించడం, రాగి వస్తువులు ధరించడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి.
శరీరానికి రాగి అనేక లాభాన్ని చేకూర్చుతుంది. అందుకే చాలా మంది పెద్ద వాళ్ళు బంగారం, వెండి ఉంగరాల కన్నా రాగి ఉంగరాలను ధరించమని ఎక్కువగా సూచిస్తారు. ఇంతకీ రాగి ఉంగరాలను ధరించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఒక సారి చూద్దాం.
రాగి ఉంగరాల రూపంలో గాని లేదా కడియాల రూపంలో గానీ ధరించడం వలన పని ఒత్తిడి తగ్గించి మనకు మానసికంగా, శారీరకంగా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి వలన మనలో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది. రాగి లోహం శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. అందుకే చాలామంది రాగి కడియాన్ని ధరించేందుకు ఆసక్తి కనబరుస్తారు. సూర్యకిరణాల ద్వారా విడులయ్యే కాంతి, శక్తి కిరణాలను అనుకూల శక్తిగా మర్చి శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. చర్మం, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలను కొంతమేరకు రాగి లోహం నివారిస్తుంది. రాగి కడియాలు లేక రాగి ఉంగరాలు ధరించినవారికి కీళ్ల సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.