Samantha : సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా కోసం సమంత ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఉహూ.. అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలని అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్ చేయడమే కూడా హాట్ టాపిక్ అయ్యింది.
పురుషుల స్వభావాన్ని కించపరిచేలా ఇందులో లిరిక్స్ ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా ‘ఊ అంటావా’ పాట వివాదంపై తమిళ వెర్షన్ రచయిత వివేక్ స్పందించారు. ‘‘పాటపై కొంతమంది పురుషులు మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఎక్కువశాతం మంది థియేటర్‌లో ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అన్నారు. అల్లు అర్జున్ సైతం ఇటీవల ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే.
‘‘ప్రస్తుతం మనం సమాజంలో ఏదైతే చూస్తున్నామో అదే పాటలా రచించారు. అందులో ఉన్న లిరిక్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి’’ అని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ మూవీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా నమోదు చేస్తున్న పుష్ప వసూళ్లు బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…