ప్రస్తుత తరుణంలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయాయి. కొందరు దంపతులు చిన్న చిన్న తగవులకే తీవ్ర మనస్థాపం చెంది.. ఆవేశంలో బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌కు చెందిన శుభమ్ అనే వ్యక్తికి, రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి చెందిన అంజలి సుమన్ అనే మహిళకు 2 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరు ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా శుభమ్ ఓ చొక్కా కుట్టించుకున్నాడు. కానీ భార్య ఇష్టానికి అనుగుణంగా అతను చొక్కా కుట్టించుకోలేదు.
దీంతో మనస్థాపానికి గురైన అంజలి భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో అతను ఉదయం భోజనం చేయకుండానే పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఫోన్ లో అంజలి భర్తతో ఇంటికి రమ్మని చెప్పింది. కానీ అతను పనుందని, మధ్యాహ్నం వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం.. అని చెప్పాడు. దీంతో మరింత మనస్థాపానికి గురైన అంజలి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేశారు. తమ బిడ్డ మృతికి శుభమ్ కారణమని, అతన్ని అరెస్టు చేయాలని అంజలి తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…