Viral Video : సోషల్ మీడియాలో వ్యూస్‌ను తెప్పించుకోవడం కోసం కొందరు పడరాని పాట్లు పడుతూ వీడియోలు చేస్తున్నారు. గతంలో టిక్‌టాక్ ఉన్న సమయంలో చాలా మంది ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పుడు టిక్ టాక్ లేకపోయినా.. సరిగ్గా అలాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కనుకనే చాలా మంది ఇప్పటికీ ఆ విధంగా వీడియోలు చేయడం మానడం లేదు. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు అభాసుపాలవుతున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సరిగ్గా ఓ యువతికి కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ హుమైరా అస్గర్ అడవిలో ఓ చోట టిక్‌టాక్ వీడియో చేసేందుకు వెళ్లింది. వెంట సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఆమె వెళ్లీ వెళ్లగానే అడవి తగలబడడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె సిబ్బంది వద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్స్ ఉన్నాయి. అయినప్పటికీ వారు మంటలను ఆర్పేందుకు యత్నం చేయలేదు. సరే.. మంటలను ఆర్పకపోయినా.. కనీసం అడవి తగలబడుతుందన్న విచారం కూడా లేదు. ఆమె టిక్‌టాక్ వీడియో చేసింది. అనంతరం దాన్ని పోస్ట్ చేసింది.

అయితే ఆమె టిక్‌టాక్ వీడియో బ్యాక్ ఫైర్ అయింది. వ్యూస్, లైక్స్ కోసం ఆమె పెట్టినా.. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. అడవి తగలబడుతుంటే చోద్యం చూస్తూ టిక్ టాక్ వీడియో చేస్తావా.. అంటూ ఆమెపై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే తరువాత ఇంకో వీడియో ద్వారా ఆమె దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
#Pakistani #TikTok sensation who faced backlash for posing by #forestfire has issued a video explanation and clarified her stand. Watch this video to know more.#HumairaAsghar #ViralVideo pic.twitter.com/SdNqGMNZ0i
— India.com (@indiacom) May 19, 2022
తాను, తన సిబ్బంది అక్కడికి వెళ్లగానే మంటలు ప్రారంభమయ్యాయని.. ఇందులో తమ తప్పు ఏమీ లేదని.. మంటలను తాము అంటించలేమని ఆమె తెలియజేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని తాము ఇదే విషయం అడిగామని.. తాను ఈ మంటలను అంటించినట్లు అతను ఒప్పుకున్నాడని.. కనుక ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇస్లామాబాద్ అటవీ శాఖ అధికారులను కోరింది. ఆ వ్యక్తి అక్కడ భారీ పాములు ఉన్నాయని చెప్పి.. వాటిని తరిమేందుకు అక్కడ మంట పెట్టినట్లు అంగీకరించాడు. అయితే వివాదం సద్దుమణిగినా ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరంతే.. మన చుట్టూ ఏం జరుగుతుందో కనీస జ్ఞానం తెలియకుండా ప్రవర్తిస్తే అలాగే జరుగుతుంది మరి..!