Kajal Aggarwal : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకసారి స్టార్ డమ్ సంపాదించుకున్న తర్వాత చాలామంది సెలబ్రిటీలు ఇతర వ్యాపార రంగాలలోకి అడుగు పెడతుంటారు. ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాన్ని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు వ్యాపార రంగాలలో తమ కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
తాజాగా వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఈమె నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కించడానికి ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇతర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం అయిన కాజల్ అగర్వాల్ ఇప్పటికే వీరి సొంత నిర్మాణ సంస్థలో మనుచరిత్ర అనే సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా, హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటించారు. అగ్ర నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి కొడుకు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా కాజల్ అగర్వాల్ నిర్మాణంలో మొట్టమొదటిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం అందుకుంటుందా.. లేదా.. అనే విషయం తెలియాల్సి ఉంది.