Cardiac Arrest : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ కారణంగానే చనిపోయారని వైద్యులు చెప్పిన విషయం విదితమే. అయితే కార్డియాక్ అరెస్ట్ వేరు, గుండె పోటు వేరు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకు సరిగ్గా ఆక్సిజన్, రక్తం సరఫరా కావు. దీంతో గుండె పోటు వస్తుంది. హార్ట్ ఎటాక్ అంటారు. కానీ కార్డియాక్ అరెస్ట్ వేరు.
కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వారి గుండె కొట్టుకోవడం సడెన్ ఆగిపోతుంది. గుండె నుంచి రక్తం సరఫరా కాదు. దీంతో మెదడుకు రక్తసరఫరా జరగదు. ఫలితంగా వెంటనే స్పృహ తప్పి పడిపోతారు. ఇలాంటి సందర్బాల్లో బతికే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే ఉంటాయి. కనుక గుండె పోటు కన్నా కార్డియాక్ అరెస్ట్ అత్యంత ప్రమాదమైంది.. అని తెలుస్తుంది. మరి కార్డియాక్ అరెస్ట్ వచ్చేందుకు కారణాలు ఏముంటాయి ? అంటే..
కార్డియాక్ అరెస్ట్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం పాటించే జీవనవిధానం, ఆహారపు అలవాట్లతోపాటు గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడడం మూలంగా గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కావు. ఈ స్థితిలో చాలా మందికి హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఇదే స్థితిలో కొందరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా రక్తనాళాలు బ్లాక్ అవడాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. గుండెను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటే బ్లాక్స్ కనిపెట్టి వాటిని తొలగించుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
2. హార్ట్ ఎటాక్ వచ్చిన కొందరికి సకాలంలో చికిత్సను అందించకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. అలాంటి వారిలో గుండె పంపింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కనుక హార్ట్ ఎటాక్‌కు గురైన వారిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందించాలి. దీంతో కార్డియాక్ అరెస్ట్‌కు గురి కాకుండా రక్షించవచ్చు.
3. గుండె కండరాల గోడలు విస్తరించడం వల్ల గుండె పెద్దగా అయినట్లు కనిపిస్తుంది. దీంతోపాటు గుండె కండరాల గోడలు గట్టిపడతాయి. ఈ స్థితిని ఎన్‌లార్జ్ హార్ట్ లేదా కార్డియోమయోపతి అంటారు. దీని వల్ల గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. పల్స్ రేట్ లేదా బీపీ సరిగ్గా ఉండదు. వేగంగా మారుతుంటుంది. ఈ స్థితి ఉన్నా కూడా వెంటనే అప్రమత్తమై డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని తేడా ఉంటే చికిత్స తీసుకోవాలి. లేదంటే కార్డియాక్ అరెస్ట్ బారిన పడతారు.
4. ఒత్తిడి లేదా పలు ఇతర కారణాల వల్ల గుండె కవాటాలు లీక్ అవడం, అక్కడి గదులు పెరగడం.. వంటి కారణాల వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.
5. పుట్టుకతోనే గుండెలో రంధ్రం పడడం లేదా ఏదైనా లోపం ఉన్నా.. అలాంటి వారిలో కార్డియాక్ అరెస్ట్ సమస్య వస్తుంది.
6. కొందరికి గుండె పంపింగ్ వ్యవస్థలో సమస్యలు ఉంటాయి. దీంతో సడెన్‌గా గుండె రక్తాన్ని పంపు చేయడం ఆగిపోతుంది. దీన్నే గుండె ఎలక్ట్రికల్ వ్యవస్థలో లోపం అంటారు. ఈ విధంగా జరిగినా కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.
అయితే పైన తెలిపినవి గుండె సంబంధ వ్యాధులకు చెందినవి. అవేకాకుండా.. కుటుంబంలో ఎవరికైనా పెద్దలకు గుండె సమస్యలు ఉండడం, హార్ట్ ఎటాక్ లతో చనిపోవడం, పొగ తాగడం, మద్యం సేవించడం, నియంత్రణలో లేని హైబీపీ, హై కొలెస్ట్రాల్, హై షుగర్ లెవల్స్, అధికంగా బరువు ఉండడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, రోజూ శారీరక వ్యాయామం చేయకపోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం.. వంటి కారణాల వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంటుంది. కనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎవరికి వారు జాగ్రత్తలు వహించాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు అవసరం అయిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…