Whatsapp : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ మొదట్లో తేజ్ పేరిట పేమెంట్స్ యాప్‌ను ప్రారంభించిన విషయం విదితమే. అయితే దాన్ని తరువాత గూగుల్ పే గా మార్చారు. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించడం కోసం అప్పట్లో గూగుల్‌లో క్యాష్‌బ్యాక్ ఇచ్చేవారు. దీంతో కొందరు రూ.1 లక్ష వరకు గెలుచుకున్నారు కూడా. అయితే ఇప్పుడు గూగుల్ పేలో అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వడం లేదు. కానీ ఇదే తరహా ఆఫర్‌ను ఇప్పుడు వాట్సాప్ ప్రారంభించింది.
వాట్సాప్‌లో పేమెంట్స్ సేవలను గతంలోనే ప్రారంభించారు. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించడం కోసం వాట్సాప్ తాజాగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.1 నగదును బదిలీ చేసినా చాలు రూ.51 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం వాట్సాప్‌లో పేమెంట్లు చేసే వారికి అందుబాటులో ఉంది.
వాట్సాప్‌లో రూ.1 ట్రాన్స్‌ఫర్ చేసినా చాలు రూ.51 క్యాష్ బ్యాక్ వస్తుంది. నగదు పంపిన వెంటనే క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం 5 ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఎంపిక చేసిన వినియోగదారులకే అందుబాటులో ఉంది. కనుక ఈ ఆఫర్ వర్తిస్తుందా, లేదా అన్నది చెక్ చేయాలంటే.. వాట్సాప్‌లో డబ్బులు పంపి చూడాలి. ఒక వేళ వస్తే.. ఇంకో నాలుగు సార్లు డబ్బులు పంపుకుని, పంపినప్పుడల్లా ఎంచక్కా రూ.51 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…