Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి వాళ్లు, వీళ్లు అన్న తేడా లేదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు అందరూ ఫిదా అయిపోయారు. పుష్ప సినిమా తెలుగు మాత్రమే కాకుండా పలు ఇతర భారతీయ భాషల్లోనూ రిలీజ్ అయింది. అయితే హిందీలో బంపర్ హిట్ అయింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారగా.. ఆయనతో నటించేందుకు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ హిందీ నటులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామని నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి స్టెప్ ఎంతో మందిని ఆకట్టుకుంది. అనేక మంది స్టార్స్, క్రికెటర్లు అల్లు అర్జున్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తున్నారు.
శ్రీవల్లి సాంగ్‌లో అల్లు అర్జున్ స్టెప్ వేస్తూ.. కాలికి ఉన్న చెప్పును విడిచిపెడతాడు. మళ్లీ తొడుక్కుంటాడు. ఇది భలే క్రేజీగా అనిపించింది. ఆ పాటలో పలుమార్లు అల్లు అర్జున్ ఈ స్టెప్ ను వేశాడు. అయితే చాలా మంది ఇలాగే చెప్పును విడిచి స్టెప్ వేస్తూ తమ సరదా తీర్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఇదే స్టెప్ గురించి అనేక మీమ్స్ వస్తున్నాయి. వాటిల్లోని ఒక ఫొటోనే ఈ చెప్పు.
అల్లు అర్జున్ ఆ పాటలో ఆ స్టెప్పు వేసేందుకు చాలా టేక్‌లు తీసుకుని ఉంటాడని.. దీంతో ఆయన చెప్పులు ఆ విధంగా అరిగిపోయి ఉంటాయని.. చాలా మంది ఈ చెప్పులతో జోక్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫొటో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ మీమ్‌ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…