మొక్కులు చెల్లించ‌క‌పోతే దేవుళ్ల‌కు నిజంగానే కోపం వ‌స్తుందా..?

మ‌నిషి అన్నాక క‌ష్టాలు వ‌స్తుండ‌డం స‌హ‌జం. ప్ర‌పంచంలో ప్ర‌తి మ‌నిషికి క‌ష్టాలు ఉంటాయి. కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి త‌క్కువ‌గా ఉంటాయి. కానీ క‌ష్టాలు లేని మ‌నుషులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నో క‌ష్టాల న‌డుమ జీవ‌నం సాగిస్తుంటారు. అయితే క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి మ‌నిషి కూడా దేవుడిపై భారం వేస్తాడు. దేవుడికి మొక్కులు మొక్కుతాడు. త‌న‌ను క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేయ‌మ‌ని ప్రార్థిస్తాడు. ఒక‌వేళ అంతా అనుకున్న‌ట్లు మంచే జ‌రిగితే త‌రువాత వ‌చ్చి మొక్కు తీర్చుకుంటాన‌ని వాగ్దానం చేస్తాడు. ఇలా చాలా మంది దేవుళ్ల‌కు మొక్కులు మొక్కుతుంటారు.

అయితే మొక్కులు మొక్కిన వారు త‌మ కోరిక నెర‌వేరిన త‌రువాత వ‌చ్చి మొక్కును తీర్చుకుంటారు. కానీ ఇలా ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేసేవారు కొంద‌రే ఉంటారు. చాలా మంది మొక్కులు మొక్కిన త‌రువాత అవి తీరితే సుఖంగా జీవ‌నం సాగిస్తారు. కానీ దేవుడికి మొక్కిన మొక్కు గురించి, దాన్ని తీర్చుకోవ‌డం గురించి మ‌రిచిపోతారు. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ క‌ష్టాలు వ‌స్తే.. ఆ స‌మ‌యంలో మ‌నం మొక్కును తీర్చుకోలేదు క‌దా.. అందుక‌నే ఇలా జ‌రిగింది.. అయితే ఈ సారి అలా చేయ‌కూడ‌దు. త‌ప్ప‌క మొక్కును తీర్చుకోవాలి.. అని మ‌ళ్లీ దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తుంటారు. ఇలా ఆ చ‌క్రం కొన‌సాగుతూనే ఉంటుంది. అయితే మొక్కిన మొక్కుల‌ను తీర్చ‌క‌పోతే నిజంగానే దేవుళ్ల‌కు కోపం వ‌స్తుందా.. దీనికి పండితులు ఏమ‌ని చెబుతున్నారు.. అంటే..

మొక్కిన మొక్కులకు కోరిక‌లు నెర‌వేరిన త‌రువాత ఆ మొక్కుల‌ను తీర్చ‌క‌పోతే దేవుళ్ల‌కు కోపం వ‌స్తుందా.. అంటే.. రాదు.. అవును.. దేవుళ్ల‌కు త‌మ భ‌క్తులు త‌మ పిల్ల‌ల‌తో స‌మానం. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌పై కోపం చూపించ‌రు క‌దా. కనుక దేవుళ్లు కూడా భ‌క్తుల‌పై కోపం చూపించ‌రు. కానీ క‌ష్టాలు వ‌స్తే మాత్రం మ‌నిషి దారి ఎటు ఉంది.. సుఖం వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉంది.. మ‌నిషి ఏ స‌మ‌యంలో మాట మీద నిల‌బ‌డుతున్నాడు.. అని ఎవ‌రికి వారు బేరీజు వేసుకునేందుకు మాత్రం మొక్కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నిషి ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డుతున్నాడా.. లేదా.. అనే దాన్ని చెప్పేందుకే ఈ మొక్కులు వ‌చ్చాయి. ఇచ్చిన మాట‌పై ఏమేర మ‌నిషి ప్ర‌యాణిస్తున్నాడు.. అనేదాని కోస‌మే మొక్కులు ఉన్నాయి. అంతేకానీ.. మొక్కులు తీర్చ‌క‌పోతే దేవుళ్లు మ‌నుషుల‌పై కోపం పెంచుకుంటార‌ని.. వాళ్ల‌ని క‌ష్టాల పాలు చేస్తార‌ని కాదు.

అయితే దేవుళ్ల‌కు మొక్కుకోవ‌డం అనేది హాస్యం మాత్రం కాకూడ‌దు. దాన్ని ఒక మాట‌గా భావించాలి. ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డాలి. ఇది జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకానీ త‌ప్పుడు మొక్కులు మొక్క‌రాదు. నిజంగా న‌మ్మ‌కం ఉండి మాట మీద నిల‌బ‌డ‌తారు అనుకుంటేనే మొక్కాలి. ఇది ఉన్న‌త విలువ‌ల‌ను నేర్పిస్తుంది. ఇక మొక్కు తీర్చుకోనంత మాత్రం ఏదో జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న చెంద‌కూడ‌దు. ఎందుకంటే.. మ‌నుషులు దేవుళ్ల‌కు ఎన్ని మొక్కులు మొక్కినా.. జీవితంలో అత‌ను క‌ర్మ ఫ‌లితం అనుభ‌వించ‌క త‌ప్ప‌దు.. అనే విష‌యాన్ని మాత్రం గ్ర‌హించాల్సిందే.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM