Governor : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు.. తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. తనను ఎక్కడికి వెళ్లినా అవమానిస్తున్నారని ఇప్పటికే గవర్నర్ తమిళిసై పలుమార్లు వాపోయారు. ఆ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షాలను ఆమె కలిశారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆమె వివరించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అధికారులు తనను రిసీవ్ చేసుకోవడం లేదని.. తన అధికారిక పర్యటనలకు వారు రావడం లేదని.. అలాగే ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని తమిళిసై ప్రధాని మోదీ.. అమిత్ షాలకు వివరించారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో గవర్నర్ మార్పు అనివార్యమని తెలుస్తోంది.
తెలంగాణకు ఇకపై తాను గవర్నర్‌గా ఉండలేనని తమిళిసై.. మోదీ, షాలకు చెప్పినట్లు సమాచారం. ఇటీవలే ఆమె ఢిల్లీ వెళ్లినప్పపుడు ఈ విషయాన్ని ఆమె చెప్పారట. అయితే తాజాగా ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఆమెకు చూచాయగా ముందే సమాచారం అందించారట. దీంతో ఆమెను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్‌గా జగ్‌దీప్ ధన్‌ఖర్ నియామం కానున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
అయితే జగ్‌దీప్ ధన్‌ఖర్ ఇప్పటికే దీదీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఆయన ఆమెకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. దీంతో ఆయనను తెలంగాణకు గవర్నర్‌గా రప్పిస్తే.. అప్పుడు సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని అంటున్నారు. జగ్‌దీప్ గవర్నర్‌గా వస్తే సీఎం కేసీఆర్ ఆటలు సాగనివ్వరని.. కనుక గవర్నర్‌గా ఆయన ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రేపో మాపో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తమిళిసై వాస్తవానికి మృదు స్వభావి. కనుక ఆమె కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టే ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో జగ్‌దీప్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం నిజమే అయితే రానున్న రోజుల్లో గవర్నర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…